బ్యాగ్ నిండా దేశీ స్నాక్స్ అందుకున్న ఎన్నారై దంపతులు.. వారి రియాక్షన్ చూస్తే ఫిదా…
TeluguStop.com
ప్రపంచంలో ఎక్కడా దొరకని టేస్టీ ఫుడ్స్( Tasty Foods ) ఇండియాలో దొరుకుతాయి.
మన ఇండియన్ ఫుడ్స్‌కు మించిన ఆహారాలు ఇండియాలో తప్ప వేరే దేశాల్లో పెద్దగా లభించవు ఈ కారణంగా విదేశాల్లో నివసించేవారు ఇండియన్ ఫుడ్ ఎవరైనా తెస్తే బాగుండు అని ఎప్పుడు కోరుకుంటున్నారు.
లండన్( London )లో నివసిస్తున్న కరిష్మా, రికిన్ అనే ఓ ఎన్నారై జంటకు కూడా ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.
అందుకే భారతదేశం( India ) నుంచి వస్తున్న వారి స్నేహితులను కొన్ని భారతీయ మసాలాలు, స్నాక్స్ తీసుకురావాలని వారు కోరారు.
"""/"/
అయితే స్నేహితులు వారిని సర్ ప్రైజ్ చేశారు.అడిగిన వాటికంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్( Food Items ) ప్యాక్ చేసి గిఫ్ట్ రూపంలో ఇచ్చారు.
ఈ దంపతులు స్నేహితుల నుంచి ఆలూ భుజియా, సేవ్ ఖమ్మి, గరం మసాలా, మ్యాగీ, కుర్కురే, లేస్, కశ్మీరీ రెడ్ చిల్లీ వంటి వాటితో కూడిన సూట్‌కేస్‌ని పొందారు.
సూట్‌కేస్‌ను తెరుస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.వారు ఈ దేశీ ఫుడ్స్( Desi Foods ) గిఫ్ట్ గా ఇచ్చినందుకు వారి స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.
"ఆనందంతో నిండిన సూట్‌కేస్" అని పిలిచారు. """/"/
ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.
కొంతమంది ఆ జంట భావాలను అర్థం చేసుకుని భారతీయ ఆహారాన్ని కూడా మిస్ అవుతున్నారని చెప్పారు.
విదేశాల్లోని భారతీయ స్టోర్లలో ఈ వస్తువులు దొరుకుతాయని కొందరు చెప్పారు.కొంతమంది ఈ జంట ఇండియన్ ఫుడ్( Indian Food ) చూసి ఉత్సాహం వ్యక్తం చేసిన తీరుపై జోకులు వేశారు.
డబ్బు కోసం భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు గా మళ్లీ ఇండియా ఫుడ్ మీకెందుకు అని కొంతమంది విమర్శించారు.
ఆరో తరగతిలో 5 లక్షల ఫండ్.. ఆ ఘటనతో ఐఏఎస్… అశోక్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!