లండన్( London )లో విషాదం చోటు చేసుకుంది.ఇటీవల భారతీయ సంతతికి చెందిన రోహన్ అనే 16 ఏళ్ల బాలుడు ప్రోటీన్ షేక్( Protein shake ) అనే ప్రత్యేకమైన డ్రింక్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
రోహన్ సన్నగా ఉండటంతో అతని ఫిజికల్ వెయిట్ కోసం తండ్రి ఈ డ్రింక్ కొనిచ్చారు.దురదృష్టవశాత్తు, ఆ డ్రింక్‌లోని ప్రోటీన్ రోహన్ శరీరంలో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ ( OTC ) డెఫిషియన్సీ అనే అరుదైన జన్యు సమస్యను కలిగించింది.
ఈ పరిస్థితి అతని మెదడు సరిగా పనిచేయకుండా చేసి చివరికి అతని మరణానికి దారితీసింది.రోహన్ చనిపోయిన తర్వాత అతని అవయవాలు దానం చేశారు.
దీనివల్ల రోహన్ ఎలా చనిపోయాడో వైద్యులకు మొదట అర్థం కాలేదు.
అయితే ఇటీవలి పరిశోధనలో రోహన్( Rohan ) మరణానికి OTC లోపం కారణమని తేలింది.ఈ విషయం త్వరగా లండన్ అంతటా పాకింది.ప్రోటీన్ షేక్ కూడా మరణానికి దారితీస్తుందా అని చాలామంది షాక్ కూడా అయ్యారు.
ఈ నేపథ్యంలో దుకాణాలలో విక్రయించే ప్రోటీన్ షేక్‌లపై ప్రజలకు వాటి ప్రమాదాల గురించి తెలియజేసేలా వాటిపై హెచ్చరికలు ముద్రించాలని న్యాయమూర్తి సూచించారు.ఈ షేక్‌లను తాగితే, OTC లోపం వంటి అరుదైన అనారోగ్యాలు వస్తాయనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని న్యాయమూర్తి కోరారు.
మరోవైపు రోహన్ తల్లిదండ్రులు తమ కుమారుడు ఇలా చనిపోతాడని ఊహించలేదని కన్నీరు మున్నీరవుతున్నారు.తన అబ్బాయి చాలా స్మార్ట్ అని, కాకపోతే సన్నగా ఉండేవాడని, అందుకే అతను కాస్త వెయిట్ పెరగడానికి ప్రోటీన్ షేక్ అందించామని తండ్రి తెలిపారు.బరువు పెరిగితే కాన్ఫిడెన్స్ పెరుగుతుందని అనుకున్నామని కానీ ఇలా ప్రాణాలే పోతాయని అసలు ఊహించలేదని అతను గుండెలు బాదుకున్నారు.