ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్( Mahesh babu ) తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.
రాజమౌళితో మహేష్ మొదటి సారి కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.అయితే మహేష్ రాజమౌళి సినిమా అసలు ఎప్పుడు మొదలవుతుంది.
సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
రాజమౌళి మహేష్ సినిమా విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అయితే ఎవరేం చెప్పినా సరే అసలేం పట్టించుకోని జక్కన్న సినిమాను తను అనుకున్న టైం కి అనుకున్న విధంగా సెట్స్ మీదకు తీసుకెళ్తాడు.మహేష్ రాజమౌళి( Rajamouli) సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని అంటున్నారు.
అదే జరిగితే మాత్రం టాలీవుడ్ టు హాలీవుడ్ అనేలా మహేష్ కెరీర్ దూసుకెళ్తుంది. గుంటూర్ కారం( Guntur Kaaram) 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయగా రాజమౌళి సినిమా నెక్స్ట్ ఇయర్ లోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్.