తండ్రి మరణానికి ఎయిర్‌లైన్స్ కారణమని ఎన్నారై సంచలన ఆరోపణలు...

కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande ) తన తండ్రి హరీష్ పంత్‌( Harish Pant ) మరణానికి ఒక విమానయాన సంస్థ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.ఇటీవల ఆమె తన తండ్రితో కలిసి భారతదేశం నుంచి కెనడాకు వెళ్లారు.

 Nri Accuses Airlines For Her Dads Death Details, In-flight Medical Emergency, Ai-TeluguStop.com

హరీష్ పంత్ కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సి పొందారు.ప్రయాణం చేయడానికి తగినంత ఆరోగ్యంగా ఉన్నారు.

అయితే విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు.

అయితే తాము ప్రయాణించిన ఎయిర్‌లైన్స్ ఎయిర్ కెనడా( Air Canada ) అమానవీయమైనదని షాను పాండే నిందించారు.

తన తండ్రికి ఛాతీ నొప్పి, ఇతర భయంకరమైన లక్షణాలు కనిపించినప్పుడు విమానాన్ని సమీప విమానాశ్రయానికి మళ్లించమని విమాన సిబ్బందిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.కానీ సిబ్బంది నిరాకరించారట.

వారు సరైన విధానాలను ఫాలో కావాలని అందుకే ఆమె చెప్పినట్టు దాని మళ్ళించడం కుదరదని పైలెట్స్‌ ( Pilots ) వెల్లడించారట.ఫ్లైట్ మాంట్రియల్‌లో( Montreal ) ల్యాండ్ అయ్యే వరకు గంటల తరబడి ప్రయాణం కొనసాగింది, అక్కడ పారామెడిక్స్ హరీష్ పంత్‌ను కాపాడలేకపోయారు.

Telugu Air Canada, Harish Pant, Heart Attack, Indian Origin, Negligence, Nri, Sh

తన తండ్రిని కోల్పోయిన షాను పాండే కృంగిపోయారు.అతనిని రక్షించడానికి ఆమె ఏదైనా చేయగలదా అని ఆలోచిస్తుంది.విమాన సిబ్బంది, విమానయాన సంస్థ నిర్ణయం తీసుకునే ప్రక్రియను కూడా ఆమె ప్రశ్నించారు.విమానంలో మెడికల్ ఎమర్జెన్సీలను( Medical Emergency ) మెయింటైన్ చేయడం కష్టం.ఎందుకంటే ఏదైనా తేడా వస్తే ఎయిర్‌లైన్స్ సంస్థని నిందిస్తారు.విమానాన్ని దారి మళ్లించాలా వద్దా అని నిర్ణయించడానికి ఏ ప్రమాణాలను ఉపయోగించాలో ప్రయాణికులకు తెలియకపోవచ్చు.

Telugu Air Canada, Harish Pant, Heart Attack, Indian Origin, Negligence, Nri, Sh

విమానాన్ని మళ్లించడం చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ వైద్య కారణాల వల్ల ఇది ఎంత తరచుగా జరుగుతుందో తెలియ రాలేదు.హరీష్ పంత్ కేసును సమీక్షించిన వైద్య నిపుణులు అతని లక్షణాలు తీవ్రమైన గుండె జబ్బును సూచించాయని, తక్షణ వైద్య సహాయం అవసరమని చెప్పారు.ఎయిర్ కెనడా విమానాన్ని దారి మళ్లించలేదని, అతని ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని వారు విమర్శించారు.షాను పాండే, ఆమె కుటుంబం ఇప్పుడు ఎయిర్ కెనడాపై నిర్లక్ష్యం, మరణానికి కారణం కావడంపై దావా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube