గలీజ్ గా మాట్లాడే వాడు.. ఎంతో ఇబ్బందిగా అనిపించింది.. షాకింగ్ నిజం చెప్పిన నోయల్ మాజీ భార్య?

క్యాస్టింగ్ కౌచ్ గత కొంత కాలం నుంచి భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఊపేస్తోంది.

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని రహస్యంగా ఉంచే వారు ఎంతో మంది హీరోయిన్లు.

కానీ నేటి రోజుల్లో మాత్రం స్టార్ హీరోయిన్ల దగ్గరి నుంచి చిన్న హీరోయిన్ ల వరకూ కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను అందరికీ చెబుతూ ఇక ఇండస్ట్రీలో పరిస్థితులను వివరిస్తున్నారు.హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు అని చెప్పాలి.

ఇకపోతే ఇటీవలే మరో హీరోయిన్ నోరువిప్పి తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది.తెలుగు రాపర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ మాజీ భార్య ఎస్తర్ నోర్హన్న పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన నటనతో ఆకట్టుకుంది.

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంతో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.తర్వాత 1000 అబద్దాలు సినిమాలో నటించింది.

Advertisement

ఇక జయ జానకి నాయక సినిమా లో కీలక పాత్రలో నటించింది.ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాకపోవడంతో కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అక్కడ వరుస అవకాశాలు అదుకుంటుంది ఈ హీరోయిన్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఎస్తర్ నోర్హన్న తనకు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదురైన చేదు అనుభవాలను చెప్పింది.కొత్తలో ఎంతోమంది తీరు మార్చుకోవాలని చెప్పారు.అప్పుడు నాకు అర్థం కాలేదు.

కానీ ఆ తర్వాత నన్ను మార్చేందుకు ప్రయత్నించారు.కొత్త సినిమా అవకాశాల కోసం పెద్ద హీరోయిన్ గా ఎదగడానికి డైరెక్టర్ చెప్పినట్లు చేయాలి అంటూ చెప్పారు.

ఆ తర్వాత కాస్త ఆలోచిస్తే డైరెక్టర్ కోరిక తీర్చాలని పరోక్షంగా చెప్పారు అన్న విషయం అర్థమైంది.ఎంతో మంది గలీజ్ గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

కానీ నాకు ఎవరో చెప్పింది చేసే కర్మ పట్టలేదు.డాన్స్ నటన అంటే ఇష్టం హీరోయిన్ అవ్వాలనుకున్న.

Advertisement

ఇలాంటివి చేస్తే వచ్చే ఛాన్సులు అసలు వద్దు అంటూ తేల్చిచెప్పింది హీరోయిన్ ఎస్తర్ నోర్హన్న.

తాజా వార్తలు