గతంలో ఎక్కువ మొత్తం డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుండేది కాదు.బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి ఎదురు చూసే సమయం లేదు.
కానీ, ప్రస్తుతం ఈ తంటాలు పాడాల్సిన అవసరం లేదు.ఇంట్లోనే ఎంచక్కా డబ్బును మీకు కావాల్సిన బ్యాంకులకు పంపించుకోవచ్చు.
ఆ వివరాలు తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం పేటీఎం తాజాగా కొత్త సర్వీసును అందిస్తోంది.
దీంతో సత్వరమే ఇతర బ్యాంకులు లేదా వ్యాలెట్స్‌కు పంపించవచ్చు.యూపీఐ లావాదేవీలు భిమ్ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ ప్రకారం రూ.10 వేలు నెలకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.పేటీఎంలో కూడా ఈ విధంగానే చెల్లింపులు జరిపేవారు.కానీ, తాజాగా నెలకు రూ.10 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పించింది.మీరు సేటీఎం వాడుతున్నట్లైయితే, కేవలం లబ్ధిదారుడి పేరును ఎంచుకున్న వెంటనే పెద్ద మొత్తం డబ్బును కూడా పంపించవచ్చు.
బ్యాంకుల చెల్లింపుల యాప్ మాదిరి ఇందులో కూడా వినియోగదారుల వివరాలతోపాటు మీరు ట్రాన్స్‌ఫర్ చేయబోయే వ్యక్తి వివరాలను నమోదు చేయాలి.ముందుగా మొబైల్‌లోని పేటీఎం యాప్‌ను ఓపెన్ చేసి, అందులో సెండ్ మనీ టూ బ్యాంక్‌ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత కుడివైపులో ఉండే మీ ప్రోఫైల్ ఐకాన్‌ను ఓపెన్ చేయాలి.అప్పుడు స్క్రీన్ కిందకు వెళ్లి సేవ్ చేసిన బెనిఫిషయరీ ఖాతా సంఖ్య,వివరాలపై క్లిక్ చేయాలి.యాడ్ బెనిఫిషియరీ పై ట్యాప్ చేయాలి.ఆ తర్వాత బ్యాంక్ ఖాతా నంబర్, అకౌంట్ హోల్డర్ పేరు,ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు చేసి యాడ్ బెనిఫిట్ బటన్ ప్రెస్ చేయాలి.
ఇలా బెనిఫిషియరీ వివరాలు నమోదు చేసిన తర్వాతసులభంగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.