ఫ‌లించ‌ని రాహుల్ చ‌రిష్మా.. దుకాణం మూసేయాల్సిందేనా..?

ఒక‌టికాదు.రెండు కాదు.

అనేక ఎదురు దెబ్బ‌లు.

అన్నీ ఓట‌ములే! ఇదీ.ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఎవరై నా మాట్లాడితే.చెబుతున్న మాట‌.

మ‌రికొంద‌రు ఇంకొన్ని అడుగులు ముందుకు వేసి.కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ చ‌రిష్మా అయిపోయింద‌ని అనేస్తున్నారు.

వాస్త‌వంగా చూస్తే.అదే నిజ‌మ‌ని అనిపిస్తోంది.

Advertisement

దేశ వ్యాప్తంగా జ‌రిగిన 56 స్థానాల ఉప ఎన్నిక‌లు, అత్యంత కీల‌క‌మైన బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా ఒక్క చోటంటే.ఒక్క చోట కూడా కాంగ్రెస్ హ‌వా చూద్దామ‌న్నా క‌నిపించ‌లేదు.

పైగా చాలా చోట్ల పోటీ చేసిన అభ్య ‌ర్థుల‌కు డిపాజిట్లే ద‌క్క‌ని దారుణ‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఇప్ప‌టికైనా పున‌రాలోచించుకోవాల్సిన త‌రుణం ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయేందుకు కాంగ్రెస్ రెడీ అయిన నేప‌థ్యంలో దాని ఓట‌ములు.అధికార లాల‌స‌, నియంతృత్వ ధోర‌ణులు వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

విఫ‌ల‌మైన నాయ‌కుడిగా రాహుల్ పేరు తెచ్చుకున్నారు.ఇక‌, బిహార్ వంటి కీల‌క రాష్ట్రంలో ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఆ పార్టీని ముంచార‌నే చెడ్డ పేరు మూట‌క‌ట్టుకోవ‌డం మ‌రింత దారుణ‌మైన ప‌రిస్థితి.కాంగ్రెస్ పోటీ చేసిన‌.

Advertisement

అది ఓడిపోయింది.కానీ ఆర్జేడీ పోటీ చేసిన దాదాపు అన్ని స్థానాల్లోనూ విజ‌యం ద‌క్కించుకుంది.

పైగా అనుభ‌శూర‌త్వం కూడా లేని తేజ‌స్వి.త‌న మాట‌ల‌తో బిహారీల మ‌న‌సు దోచుకున్నారు.

ఎంతో అనుభ‌వం ఉంది.ప్ర‌ధాని అభ్య‌ర్థి రేసులో ఉన్న రాహుల్ మాత్రం ఆ మాత్రం బిహారీల‌ను త‌న‌వైపు తిప్పుకోలేక పోయారు.

స‌రే.! ఇవ‌న్నీ ఇలా ఉంటే.

మ‌ధ్య ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచి.బీజేపీతో అంట‌కాగిన నేత‌లు.

ఇప్పుడు బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తే.అక్క‌డ కూడా కాంగ్రెస్ త‌ర‌ఫున పోరాడి.

వారిని ఓడించ‌లేక పోయారు రాహుల్‌.సింప‌తీని ఏమాత్రం పుంజుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక పోయారు.దేశ‌వ్యాప్తంగా క‌రోనాతో ఉపాధిపోయి.

ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.ఆదాయాలు త‌గ్గిపోయి.

ప్ర‌జ‌లు అల‌మ‌టిస్తున్నారు.రైతు చ‌ట్టాల‌తో మోడీ.

కార్పొరేట్ వ్య‌వ‌సాయానికి తెర‌దీశారు.ఇంత వ్య‌తిరేక‌త‌లోనూ బీజేపీ పుంజుకోగా.

దానిని క్యాష్ చేసుకోవ‌డంలో కాంగ్రెస్ మాత్రం వెనుక‌బ‌డి పోయింది.అర్ధ‌ర‌హిత పొత్తులు.

ఆలోచ‌న‌లేని వ్య‌వ‌హారాల‌తో రాహుల్ పొద్దుపుచ్చుతున్నార‌నే వాద‌న మ‌రోసారి రుజువైన ద‌రిమిలా.కాంగ్రెస్ ఉనికి ప్ర‌మాద‌క‌రంగా మారింద‌న‌డంలో సందేహం లేదు.

తాజా వార్తలు