వాలంటీర్లు కాదు... వసూల్ రాజాలు

ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం , ప్రజల ఇంటి గడప వద్దకే పాలన అంటూ గ్రామ /వార్డ్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు.

ఈ వాలంటీర్ వ్యవస్థ పై తాజాగా టీడీపీ మహిళా నేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

టీడీపీ పాలనలో రైతుల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా తయారయ్యారని.కానీ , వైసీపీ హయాంలో లంచాలు తీసుకునే వాలంటీర్లుగా తయారయ్యారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శల వర్షం కురిపించారు.

ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కూడా లంచం ఇవ్వాలని , బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా వాలంటీర్ కు లంచం ఇవ్వాల్సిందేనని, వీరందరూ వాలంటీర్లు కాదని.వసూల్ రాజాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పేద ప్రజలను కూడా డేగల్లాగ పీక్కుతింటున్నారని చెప్పారు.అలాగే , వైయస్సార్ ఆసరా కింద నిజమైన లబ్ధిదారులకు సాయం అందలేదని , వృద్ధులకు పింఛన్ రావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.

Advertisement

ముఖ్యమంత్రి సహాయనిధి కింద వైసీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారని, జలయజ్ఞంలో లక్షల కోట్లు కొల్లగొట్టారని, అందుకే జగన్ పై 11 ఛార్జిషీట్లు వేశారని ఎద్దేవా చేశారు.జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గుర్తించాలని కోరారు.

శోభన్ బాబు రింగు ఈ సినిమా నుంచి స్టార్ట్ అయ్యిందా..??
Advertisement

తాజా వార్తలు