ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ మిస్ అయినట్టేనా? ఇంకా ఛాన్స్ ఉందా?

టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కురిపించింది.

 Not Rrr Or Kashmir Files Gujarati Film Chhello Show India Oscars Entry, Chhello,-TeluguStop.com

ఈ సినిమాతో ఇద్దరి హీరోలు పాన్ ఇండియా స్టార్ లుగా మారిన విషయం తెలిసిందే.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్ర బృందం పై ,ఇద్దరు హీరోలపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.తెలుగు సినిమా సత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాకు బిగ్ షాక్ తగిలింది.

బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా అనేక రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమాకూడా 2023 ఆస్కార్ నామినేషన్ రేసులో ఎంట్రీ లభించలేదు.అంతేకాకుండా కాశ్మీర్ ఫైల్స్ కు సైతం ఆస్కార్ రేసులో చోటు దక్కలేదు.

ఆర్ఆర్ఆర్, కాశ్మీర్ ఫైల్స్ ను దాటుకుని ఒక చిన్న సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.

Telugu Chhello, Indiasofficial, Kashmir, Oscar, Rrr-Movie

ఇక ఇది ఇలా ఉంటే గుజరాతి సినిమా అయినా ఛేల్లో మూవీ ఆస్కార్ నామినేషన్ రేసులోకి అధికారిక ఎంట్రీ ఇచ్చింది.బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో ఈ సినిమా చోటును దక్కించుకుంది.ఇదే విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులను సృష్టించిన ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంటుంది అని జోరుగా ప్రచారాలు కొనసాగాయి.అని ఇలా ఊహించిన విధంగా ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఎంపిక కాకపోవడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube