మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పోన్నియన్ సెల్వన్( Ponniyan Selvan ).ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదలై విమర్శల ప్రశంసలు సైతం అందుకుంది.
భారీ తారాగణంతో ఈ సినిమాని దర్శకుడు మణిరత్నం ( Mani Ratnam ) తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను ఒకప్పుడు తెరకెక్కిద్దాం అనుకున్నప్పుడు చాలామంది వేరే వేరే నటీనటులతో తీయాలి అనుకున్నారట.
కానీ ఆ సమయంలో సినిమా తీయడం కుదరకపోవడంతో మళ్లీ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి ఆయన అనుకున్న సినిమా నటినటులు అందరూ పక్కకు వెళ్లి వేరే తారాగణం వచ్చి పడ్డారు.అలా విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష ఇలా చాలామంది ఈ సినిమాలో ఉన్నారు.

అయితే ఈ సినిమాలో విక్రమ్ ప్లేస్ లో ముందుగా కమలహాసన్ ( Kamal Haasan) ని తీసుకోవాలి అని మణిరత్నం భావించారట.అంతేకాదు కమలహాసన్ ని హీరోగా పెట్టుకొని తీద్దామని ఫిక్సయ్యి కమలహాసన్ కి సంబంధించిన రాజ్ కమల్ ఫిలిమ్స్ పతాకం పైనే పొన్నియన్ సెల్వన్ సినిమాకు సంబంధించిన బుక్ హక్కులు కూడా కొన్నారట.కానీ చివరికి అంతా తారుమారు అయిపోయింది.అలాగే ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) ప్లేస్ లో ముందుగా మణిరత్నం వేరే హీరోయిన్ ని అనుకున్నారట.
ఆమె ఎవరో కాదు ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ.

ఈ సినిమాలో రేఖా అయితేనే తన పాత్రకి న్యాయం చేయగలుగుతుందని అన్ని ఎమోషన్స్ చూపించగలదని భావించారట.ఓ పక్క ఎమోషన్ మరోపక్క అందాన్ని రెండిటిని రేఖ ( Rekha ) మెయింటైన్ చేయగలదు అని మణిరత్నం అనుకున్నారట.కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితులు తనకి అనుకూలంగా లేకపోవడం వల్ల చివరికి హీరోయిన్ రేఖ అనుకున్న ప్లేస్ లో ఐశ్వర్య రాయ్ వచ్చి పడింది అని రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో మణిరత్నం చెప్పుకొచ్చారు.







