‘ఉల్టా పల్టా’ క్యాప్ష( Ulta-Pulta )న్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరమైన టాస్కులతో ఆడియన్స్ ని అలరిస్తూ, అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇప్పటి వరకు జరిగిన అన్నీ బిహ బాస్ తెలుగు సీజన్స్ లో ప్రస్తుతం నడుస్తున్న సీజన్ ది బెస్ట్ అని చెప్తున్నారు.
గత వారం యావర్ ఏవిక్షన్ పాస్ ని వెనక్కి ఇచ్చేయడం వల్ల ఎలిమినేషన్ ని రద్దు చేసిన బిగ్ బాస్ టీం, ఈ వారం ఏవిక్షన్ పాస్ టాస్కుని నిర్వహించగా పల్లవి ప్రశాంత్ గెలుపొందాడు.ఇక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని నాగార్జున ఇప్పటికే చెప్పడం తో, ప్రశాంత్ ఈ ఏవిక్షన్ పాస్ ని ఉపయోగించి ఏ కంటెస్టెంట్ ని సేవ్ చేస్తాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఓటింగ్ ప్రకారం అమర్ దీప్ మరియు ప్రశాంత్( Amardeep ) టాప్ 2 క్షణాల్లో ఉండగా, అతి తక్కువ ఓటింగ్ తో అశ్వినీ మరియు రతికా బాటమ్ రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.

ప్రశాంత్ తన దగ్గర ఉన్న ‘ఏవిక్షన్ పాస్’( eviction-pass ) ని ఉపయోగించి ఒకరిని సేవ్ చెయ్యకపోతే ఇద్దరూ ఎలిమినేట్ అయిపోతారు.లేదా ఆ ఏవిక్షన్ పాస్ ని ఉపయోగించి ఒకరిని సేవ్ చెయ్యొచ్చు.అయితే నెటిజెన్స్ అభిప్రాయం ప్రకారం ప్రశాంత్ ఈ పాస్ ని ఉపయోగించి రతికా ని సేవ్ చేస్తాడని అనుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకి వచ్చింది.వచ్చే నెల 17 వ తారీఖున గ్రాండ్ ఫినాలే ని ఏర్పాటు చేయబోతున్నారట.
ప్రతీ సీజన్ ఫినాలే లో టాప్ 5 కంటెస్టెంట్స్ ని మాత్రమే హౌస్ లో ఫినాలే కి ఉంచుతారు.కానీ అన్నీ సీజన్స్ లాగ ఈ సీజన్ ఉంటే ఏమి వెరైటీ ఉంటుంది చెప్పండి.
అసలే ఈ సీజన్ కి ‘ఉల్టా పల్టా‘ క్యాప్షన్ పెట్టారు.

అందుకని ఈ సీజన్ ఫినాలే కి 5 మంది కంటెస్టెంట్స్ కాకుండా, 7 మంది కంటెస్టెంట్స్ ని ఉంచబోతున్నారట.ఎందుకంటే ఇది సీజన్ 7 కాబట్టి, 7 మందిని ఉంచితే బాగుంటుందని టీం ఇలా ప్లాన్ చేసిందట.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది.
ఈ వారం బిగ్ బాస్ ప్రైజ్ మనీ, మరియు దానికి సంబంధించిన కొన్ని ట్విస్టులను నాగార్జున కంటెస్టెంట్స్ కి తెలియచెయ్యబోతున్నారట.ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ప్రైజ్ మనీ లో కచ్చితంగా ఎదో ఒక మెలిక పెట్టి ఉంటారని నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు, చూడాలి మరి.