బాలీవుడ్ పలువురు స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయం, నటన తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ “మాధురీ దీక్షిత్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలలో నటించినప్పటికీ మొత్తం దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
కాగా నటి మాధురి దీక్షిత్ 1999వ సంవత్సరంలో “అబొద్” అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
అయితే 1999వ సంవత్సరంలో శ్రీ రామ్ మాధవ్ అనే ప్రముఖ వైద్యుడు ని పెళ్లి చేసుకుంది.పెళ్లయిన తర్వాత కూడా తన భర్త అంగీకారంతో మాధురి దీక్షిత్ పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
కాగా ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు మాధురి దీక్షిత్ బయోపిక్ ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖ డాన్సర్ మరియు మోడల్ “నోరా ఫతేహి” స్పందించింది.ఇందులోభాగంగా తనకి మాధురి దీక్షిత్ ఆరాధ్య నటి అని చిన్నప్పటి నుంచి ఆమె చిత్రాలు చూస్తూ పెరిగానని, అలాగే తనకి మాధురి దీక్షిత్ బయోపిక్ లో నటించాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టింది.
దీంతో ఉన్నట్లుండి నటి మాధురి దీక్షిత్ బయోపిక్ తెరపైకి వచ్చింది.మరి ఈ అమ్మడి నెరవేరుతుందో లేదో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నోరా ఫతేహి హిందీలో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న “భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అంతే కాకుండా పలువురు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బాగానే అలరిస్తోంది.