పానీపూరీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు.సాయంత్రం అయితే చాలు పానీపూరి( Panipuri ) బండి దగ్గర అందరూ క్యూ కడతారు.
ఇక అమ్మాయిలకు అయితే పానీపూరి అంటే మరింత ఇష్టం.పానీపూరి బండి కనిపిస్తే చాలు వెంటనే దాని దగ్గరకు వెళ్లిపోతారు.
ఇక చిన్నపిల్లలు కూడా పానీపూరిని బాగా ఇష్టపడతారు.పానీపూరి అనగానే వెజ్ ఆహార పదార్ధాలు( Veg Foods ) మాత్రమే అందులో ఉంటాయి.
కారం, ఉప్పు లాంటివి ఉపయోగిస్తారు.కానీ నాన్ వెజ్ పానీపూరిని ఎప్పుడైనా చూశారా.
రకరకాల ఐటెమ్స్‌తో పానీపూరి తయారుచేస్తోన్నారు.ఇలాంటి రకరకాల ఆహార పదార్ధాలతో తయారుచేసిన పానీపూరికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా అలాంటి ఒక విభిన్నమైన పానిపూరి ఆకర్షణీయంగా ఉంది.కొంతమంది పానీపూరిని మ్యాగీతో తయారుచేస్తే.మరికొంతమది ఐస్‌క్రీంతో తయారుచేస్తున్నారు.ఇక మామిడిపండ్లతో కూడా పానీపూరి తయారుచేయడం చూస్తూ ఉంటాం.
కానీ తాజాగా నాన్ వెజ్ ఐటమ్స్‌తో( non-veg items ) తయారుచేసిన పానీపూరి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.పశ్చిమబెంగాల్లోని ఒక బండి దగ్గర నాన్ వెజ్ తో తయారుచేసిన పానీపూరిలను సర్వ్ చేస్తున్నారు.ఈ వెరైటీ కాంబినేషన్‌కు పుచ్కా అని పేరు పెట్టారు.వివిధ రకాల రుచులతో ఈ నాన్ వెజ్ పానీపూరి స్టాల్ లో కస్టమర్లకు మంచి రుచికరంగా అందిస్తున్నారు.
అలాగే ఇక్కడ మెనూను కూడా అందుబాటులో ఉంచారు.ఈ మెనూ కూడా సోషల్ మీడియలో వైరల్ గా మారింది.
ఈ మెనూ చూస్తే మటన్ పానీపూరి, చాక్లెట్ పానీపూరి, ఫిష్ పానీపరి, ప్రాన్స్ పానీపూరి, చికెన్ పానీపూరి లాంటివి అందులో రాసి ఉన్నాయి.ఈ మెనూ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇవి తింటే ఏమీ తేడా అనిపించదుగా అంటూ కొంతమంది కామెంట్ చేస్తోన్నారు.