రామ్ దేవ్ బాబాపై నాన్ బెయిలెబుల్ వారెంట్ .. ముదిరిన కేసు

ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి "మెడమీద కత్తిపెట్టిన భారత్ మాతకి జై" అనే నినాదం చేయమని గత ఏడాది చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో మీకు గుర్తు ఉండే ఉంటుంది.

ఇస్లాం మతంలో దేవుడికి తప్ప, ఇంకెవరికి పూజలు చేయడం, భక్తినివ్వడం చెల్లదని, భారత్ తన దేశం కాని భారత్ మాత అనే ఊహాజనక తల్లికి తాను నమస్కరించనని, దేశాన్ని ప్రేమించడం అంటే లేని తల్లికి మొక్కడం కాదు అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్న సంగతి తెలిసిందే.

ఓవైసి చేసిన ఈ వ్యాఖ్యలకి మిశ్రమ స్పందన లభించింది.దేశవ్యాప్తంగా కొందరు ముస్లీములు ఓవైసి వ్యాఖ్యలను సమర్థిస్తూ అవే వ్యాఖ్యాలను రిపీట్ చేస్తే, మరికొంతమంది ముస్లీములు మాత్రం భారత్ మాతకి జై అంటూ ర్యాలీలు తీసారు.

రాజ్యసభలో మరో ముస్లీం నేత, బాలివుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా పెద్ద ఎత్తున భారత్ మాతకి జై అంటూ నిందించారు.ఇదే ఊపులో ఓ వివాదస్పదమైన వ్యాఖ్య చేసారు బాబా రాందేవ్.

గత ఏడాది ఓ పబ్లిక్ ర్యాలిలో మాట్లాడుతూ "భారత్ మాతకి జై అంటూ నినదించని వారి తలలు నరికేస్తా" అంటూ ఓ పెద్ద స్టెట్‌మెంట్ వదిలారు.దాంరో రాందేవ్ బాబా మీద విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐపిసి 504 సెక్షన్ కింద కేసు పడింది.

Advertisement

ఈ వ్యాఖ్యలను బాబా సమర్థించుకున్నారు.ఓవైసి చేసిన వ్యాఖ్యలకు స్పందించానని, అలాంటివారికి ఇలాంటి సమాధానమే ఇవ్వాలని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే కేసు విచారణ మొదలైనా, కోర్టుకి మాత్రం హాజరవ్వలేదు బాబా.దాంతో బాబాపై నాన్ బెయిలెబుల్ వారంట్ వదిలారు.

ఆగష్టు 3వ తేది లోపు కోర్టుకి హాజరవకపోతే అరెస్టు చేసైనా హాజరుపరచాలని స్థానిక పోలీసులకి ఆదేశాలు జారి చేసింది రోహతక్ లోని అడిషినల్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేటు కోర్టు.ఈమధ్య కాలంలో రాందేవ్ బాబా వివాదస్పద కారణాలతో వార్తల్లో నిలవడం ఇది రెండోసారి.

పతంజాలి ప్రాడక్ట్స్ హానికరం అంటూ మిలిటరి క్యాంటిన్స్ నుంచి కొన్ని పతంజాలి ప్రాడక్ట్స్ ని తొలగించిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది.ఇప్పుడేమి నాన్ బెయిలెబుల్ వారంట్ మెడకు చుట్టుకుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు