నోకియా ఫీచర్ ఫోన్లు మైమరిపించే ఫీచర్లతో లాంచింగ్ ఎప్పుడంటే..?

HMD గ్లోబల్ తన పాపులర్ బ్రాండ్ నోకియా( Nokia ) ఫోన్ లను సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది.నోకియా ఫీచర్ ఫోన్లు, నోకియా స్మార్ట్ ఫోన్లు ఎప్పటికప్పుడు లాంచ్ అవుతూనే ఉన్నాయి.

 Nokia 230 2024 6310 2024 And 5310 2024 Announced,nokia ,nokia New Phones,nokia-TeluguStop.com

నోకియా 6310 (2024), నోకియా 5310 (2024), నోకియా 230 (2024) అనే మూడు ఫోన్లను లాంచ్ చేసింది.ఈ ఫోన్లో డిజైన్ తో పాటు ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.

నోకియా 6310 (2024) ఫోన్ ( Nokia 6310 (2024 ) ):


ఈ ఫోన్ 2.8 అంగుళాల LCD డిస్ ప్లే, డ్యూయల్ సిమ్ స్లాట్, మైక్రో SD కార్డ్ స్లాట్ ఫీచర్లతో ఉంటుంది.1450 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.USB టైప్-C పోర్టు ద్వారా చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

నోకియా 5310 (2024) ఫోన్( Nokia 5310 (2024 ) ):


ఈ ఫోన్ 2.8 అంగుళాల LCD డిస్ ప్లే తో ఉంటుంది.ఈ ఫోన్ యూనిసోక్ 6531F చిప్ సెట్ తో వస్తుంది.1450mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ ఫోన్ లో FM రేడియో, డ్యూయల్ స్పీకర్లు, మైక్రో SD కార్డ్ స్లాట్, USB టైప్-C పోర్టు లాంటి ఫీచర్లతో వస్తుంది.

నోకియా 230 (2024) ఫోన్( Nokia 230 (2024 ) ):


ఈ ఫోన్ 2.8 అంగుళాల TFT డిస్ ప్లే తో ఉంటుంది.LED ఫ్లాష్ సపోర్టుతో 2 ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది.

సెల్ఫీల కోసం 2ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ యూనిసోక్ 6531F చిప్ సెట్ తో వస్తుంది.1450mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, USB పోర్ట్, బ్లూ టూత్ 5.0, ఆడియో జాక్ 0.3mm లాంటి ఫీచర్లతో వస్తుంది.

ఈ మూడు నోకియా ఫీచర్ ఫోన్ల ధర మరియు సేల్ వివరాలను HMD గ్లోబల్ ఇంకా వెల్లడించలేదు.

కానీ ప్రీమియం ధరలోనే త్వరలో అమ్మకానికి రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube