ఒకప్పుడు ప్రయాణించాలంటే. ఒకింత ఇబ్బందులతో కూడుకొన్న పరిస్థితి.ఆర్టీసి బస్సులనో, ఆటోలనో ఆశ్రయించాల్సిన పరిస్థితి.కాల క్రమంలో ఆ పరిస్థితి పూర్తిగా మారింది.ప్రైవేట్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఎంతకో కొంతకు బేరం కుదుర్చుకుని.
ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరేవారు.అయితే.
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులకి ఇంకా ఉపశమనం చేకూరింది.Uber, Ola సర్వీసులు వచ్చాక.
ప్రయాణికులు ఆయా యాప్‌లలో సింపుల్‌గా క్యాబ్‌లను బుక్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఉబెర్.
ఓ ప్రయాణికుడికి భారీ షాకిచ్చిది.భారీ మొత్తంలో అతడి నుంచి ఛార్జ్ వసూలు చేసి, దిమ్మతిరిగేలా చేసింది.
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేబర్షి దాస్‌గుప్తా. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టర్మినల్ 2 నుంచి నోయిడాలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబెర్‌ను ఆశ్రయించాడు.
క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు.అనంతరం బిల్లు చెల్లించబోయి.
ఒక్కసారిగా షాకయ్యాడు.కేవలం 45 కిలో మీటర్ల ప్రయాణానికి రూ.2,935 బిల్ రావడంతో అవాక్కయ్యాడు.

ఇక చివరికి చేసేదేమీ లేక.ఆ మొత్తాన్ని చెల్లించేశాడు.అయితే అనంతరం తనకు జరిగిన అన్యాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.‘నేను 45 కిలోమీటర్లు ప్రయాణిస్తే.149 కిలో మీటర్ల ప్రయాణించినట్లు ఉబెర్‌లో చూపించిందని.అందుకుగాను రూ.2,935 బిల్లు చెల్లించాల్సి వచ్చింది’ అని వాపోయాడు.అంతేకాకుండా తన నుంచి వసూలు చేసిన అధిక మొత్తాన్ని తిరిగి తన ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఇదే సమయంలో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.