బాబు పిలుస్తున్నాడు తమ్ముళ్లూ..! వినబడుతోందా ?

రాబోయే ఎన్నికలను తలుచుకుని టిడిపి అధినేత చంద్రబాబు చాలా టెన్షనే పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే ఆయన నిత్యం జనాల్లో ఉంటూ, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తునే వస్తున్నారు.

 Chandra Babu Babu Naidu Focus On Tdp Incharges Chandrababu, Tdp,ap, Ysrcp, A-TeluguStop.com

తనతో పాటు పార్టీ శ్రేణులు జనాల్లోకి వెళ్లే విధంగా రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నా చంద్రబాబు తపన ను పెద్దగా అర్థం చేసుకోనట్టుగానే నాయకులు వ్యవహరిస్తున్నారు.ఏపీ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు ఇన్చార్జిలు లేకపోవడంతో, పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంతంత మాత్రమే అన్నట్టుగా సాగుతున్నాయి .అలాగే ఇన్చార్జిలు ఉన్నచోట , నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో అంత ఆసక్తి అయితే చూపించడం లేదు.

    పార్టీ కార్యక్రమాల నిర్వహణ ఆర్థిక, వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో, చాలా చోట్ల నియోజకవర్గల్లో బాధ్యతలు నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదు.

చంద్రబాబు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్న ఎవరు పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే బాబు జిల్లాల పర్యటన చేపడుతూ,  పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక పదేపదే పార్టీ నాయకులు దూకుడు పెంచాలని పిలుపునిస్తున్నారు.వచ్చేది ఎన్నికల సంవత్సరం అని, పార్టీ నేతలంత అలసత్వం వీడి ప్రణాళికతో పనిచేయాలని బాబు సూచిస్తున్నారు.

తాజాగా అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం , సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇంచార్జిలతో భేటీ అయిన చంద్రబాబు ఎన్నికల్లో గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలనే విషయంపై దిశా నిర్దేశం చేశారు.
     

Telugu Ap, Chandrababu, Lokesh, Tdp, Ysrcp-Politics

  నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.నియోజకవర్గాల నివేదికల ఆధారంగా పార్టీ ఇన్చార్జిలతో చంద్రబాబు మాట్లాడారు.ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ పార్టీ పరిస్థితిని నాయకుల వ్యవహార శైలిని బాబు అంచనా వేస్తున్నారు.

దాని ఆధారంగానే ఇప్పుడు ఇన్చార్జీలతో సమావేశాలు నిర్వహిస్తూ , పార్టీని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమి చేయలేదని,  అభివృద్ధి మూలన పడిందనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని బాబు హితబోధ చేస్తున్నారు.

పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో నాయకులంతా పాల్గొనాలని , స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని, ప్రజల సమస్యలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే విషయాన్ని జనాలలోకి తీసుకువెళ్ళలి అని బాబు సూచిస్తున్నారు.అయితే చాలా నియోజకవర్గంలో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారు పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం,  ఇన్చార్జిల నియామకాలు పూర్తిస్థాయిలో జరగకపోవడం ,ఆర్థిక భరోసా పార్టీ నుంచి అందకపోవడం ఇవన్నీ ఇప్పుడు టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.అందుకే పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని బాబు ఎంతగా ఒత్తిడి చేస్తూ, ఎన్నికలంటూ అలర్ట్ చేసే ప్రయత్నం చేసినా, నాయకుల్లో ఆ స్థాయిలో చురుకుదనం అయితే కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube