శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా చేసిన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈమధ్య తన ట్రాక్ పూర్తిగా తప్పాడని చెప్పాల్సిందే.కంటెంట్ మీద కాకుండా కాంట్రవర్శీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన వర్మ అడల్ట్ కంటెంట్ సినిమాలతో టైం పాస్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో వర్మ సినిమాల మీద ఆడియెన్స్ కి ఇదివరకు ఉన్న ఫోకస్ పోయింది.ఆర్జీవి సినిమా ఎప్పుడొచ్చింద్ది ఎప్పుడు వెళ్లిందో అన్నట్టుగా మారింది పరిస్థితి.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా వర్మ డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమాకు కనీసం థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
నైనా గంగూలి, అప్సరా రాణి కలిసి నటించిన ఈ లెస్బియన్ లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 8 అనగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.
అయితే సినిమాకు మల్టీప్లెక్స్ లో ఛాన్స్ లేకపోగా సింగిల్ స్క్రీన్స్ కూడా సినిమా వేసేందుకు ఆసక్తి చూపించట్లేదు.హైదరాబాద్ లో డేంజరస్ సినిమాకు ఒక థియేటర్ కూడా దొరకలేదు అంటే ఆర్జీవి సినిమాని జనాలు ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.
ఓ పక్క పి.వి.ఆర్, ఐనాక్స్ అయితే ఆర్జీవి లెస్బియన్ కంటెంట్ మూవీ డేంజరస్ ని మా థియేటర్లలో ఆడించేది లేదని తేల్చి చెప్పారు.మొత్తానికి వర్మకి ఇలాంటి షాకులు బాగానే తగులుతున్నాయి.







