రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఆల్రెడీ వీళ్లిద్దరు కలిసి నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సినిమాలో నటించారు.
ఆ సినిమాలో వీళ్ల రోల్స్ చాలా చిన్నవే కానీ ఇద్దరి జోడీ చేసిన ఇంప్యాక్ట్ బాగా అనిపించింది.ఇక ఈమధ్య వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న సమంత విజయ్ సినిమా కోసం ఎక్సైటింగ్ గా ఉంది.
నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాలను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
టక్ జగదీష్ రిజల్ట్ తేడా కొట్టినా ఈసారి మరింత ఫోకస్ తో వస్తున్నాడు.
అయితే విజయ్, సమంత ఇద్దరు డైరక్టర్ శివ నిర్వాణకి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.తమకున్న వేరే కమిట్ మెంట్స్ వల్ల ఈ సినిమా మొత్తం 4 నెలల్లో పూర్తి చేయాలని చెప్పారట.
ఆ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది.విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు.
ఈ సినిమా తర్వాత విజయ్ జన గణ మన సినిమా చేస్తున్నాడు.







