ఇక ఆర్థిక దిగ్బంధనమే ! టీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు బిజెపి ఎంతగానో ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణలో  టిఆర్ఎస్ ఎంతగా బలహీనం అయితే అంతగా తమకు అవకాశం దక్కుతుందనే ఆలోచనలో బిజెపి ఉంది.

 No More Financial Blockade! Bjp As Trs Target, Trs, Telangana, Kcr, Bjp, Tdp, Tr-TeluguStop.com

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బిజెపి పోరాటాలు చేస్తుంది.వీలునప్పుడల్లా కేంద్ర బిజెపి పెద్దలు తెలంగాణలో సభలు , సమావేశాలు నిర్వహిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.

గతంతో పోలిస్తే బీజేపీ తెలంగాణ లో బాగా బలపడటంతో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమా బిజెపి నేతల్లో రోజురోజుకు పెరుగుతోంది.

అయితే బిజెపి ఎత్తుగడలను టిఆర్ఎస్ ఎదుర్కుంటూనే పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుండటం తో ఎన్నికల సమయం నాటికి టీఆర్ఎస్ కు గట్టి ఝలక్ ఇచ్చేలా బిజెపి ప్రణాళికలు రచిస్తోంది.

  దీనిలో భాగంగానే టిఆర్ఎస్ ను ఆర్థికంగా దిగ్బంధనం చేయాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు సమాచారం.ఒక పక్క టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేస్తూనే , టిఆర్ఎస్ ఆర్థిక మూలాలపై బీజేపీ దృష్టి సారించింది.

టిఆర్ఎస్ కు ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయి ? ఎవరు అందిస్తున్నారు ? టిఆర్ఎస్ లో కీలక నాయకుల పరిస్థితి ఏమిటి ? వారి వ్యాపార వ్యవహారాలు ఇలా అన్నింటి పైనా సమగ్రంగా బీజేపీ అగ్రనేతలు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం.

Telugu Amith Sha, Congress, Modhi, Telangana, Trsfinancial, Trs-Politics

 సరైన సమయంలో టిఆర్ఎస్ లో ఆర్థిక బలవంతులను టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వారిని ఇరుకుని పెట్టే ఆలోచనతో బిజెపి పెద్దలు ఉన్నట్లు సమాచారం.2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపిని ఏ విధంగా అయితే ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేశారో టిఆర్ఎస్ పైన అదే అస్త్రాన్ని ఉపయోగించాలని డిసైడ్ అయ్యారట.తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని , నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెడుతోంది అని పదేపదే టిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న క్రమంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంతో పాటు,  టిఆర్ఎస్ పార్టీ పై పై చేయి సాధించేందుకు  వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube