చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఏం చేసినా ఊహకు కూడా అందదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అద్బుతమైన కథలను సినిమాలుగా మాల్చుతూ ఆయన చేసే సినిమాలు అన్ని కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి.

ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు ఇటీవల షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.ఇక ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌ మరియు వీడియో వచ్చేసింది.

అయితే అందరిని ఆశ్చర్యపర్చే విధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఉంది.ఎన్టీఆర్‌ ను కొమురం భీమ్‌ గా చూపిస్తామంటూ ఒక ముస్లీం యువకుడి పాత్రలో ఎన్టీఆర్‌ను చూపించబోతున్నట్లుగా అనిపిస్తంది.

Advertisement

హీరోలు ఇద్దరిని కొమురం భీమ్‌ మరియు అల్లూరి అంటూ చెప్పిన రాజమౌళి అసలు ఏం చేస్తున్నాడో అర్థం అవ్వడం లేదు అంటూ జనాలు జట్టు పీక్కుంటున్నారు.రాజమౌళి ఏం చేసినా కూడా క్లారిటీ ఉంటుంది.

కాని ఈసారి మాత్రం ప్రేక్షకులను గందరగోళంకు గురి చేస్తున్నాడు.ఇప్పటికే సినిమా స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో కాదని తేల్చి చెప్పిన జక్కన్న సినిమాను అప్పటి జెనరేషన్‌కు కాకుండా ఇప్పుడు జనరేషన్‌కు తగ్గట్లుగా రూపొందిస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అలాంటప్పుడు కొమురం భీమ్‌ మరియు అల్లూరి పేర్లు ఎందుకు పెట్టారు అంటున్నారు.ఆ ఇద్దరి పేర్లు పెట్టి చరిత్రను వక్రీకరించడం ఏమాత్రం సమంజసం కాదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అల్లూరి మరియు కొమురం భీమ్‌ అభిమానులు మరియు ఆయా జాతులకు సంబంధించిన వారు ఇప్పటి నుండే చరిత్రను వక్రీకరిస్తే ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు