సాధారణంగా ప్రభుదేవా( prabhu deva ) డాన్స్ చేస్తుంటే ఆయనను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.100 మంది డాన్సర్స్ మధ్యలో ప్రభుదేవా డాన్స్ చేసిన కూడా కళ్ళు ఆయన ఉన్న చోటుకే వెళతాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలోనే ఉన్న డాన్సర్స్ అందరిలో కూడా ప్రభుదేవా నెంబర్ వన్ టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు.అందుకే చాలామంది ఆయన పక్కన డాన్స్ వెయ్యాలంటే భయపడతారు.
అలా ప్రభుదేవా చూపు తిప్పుకోలేని విధంగా మనల్ని తన డాన్స్ తో మైమరిపించేస్తారు.ఇక ఇటీవల కాలంలో తమిళ్ హీరో విజయ్ కుమార్ నటించిన గోట్ సినిమాలోని ఒక పాట విడుదల అయింది.
ఇందులో ప్రభుదేవా డాన్స్ కూడా కాసేపు కనిపిస్తుంది.ఆయనే ఇచ్చే చిన్న మూమెంట్ అయినా కూడా మనకు ఎంతో ఆనందాన్నిస్తూ ఉంటుంది.

కేవలం ప్రభుదేవా డాన్సులతోనే( dances ) కొన్ని పాటలు విజయవంతం అయ్యాయి అంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పుడు ప్రభుదేవా తో పాటు పోటీగా ఒక అమ్మడు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభుదేవా కన్నా కూడా ఆమె తన స్టెప్పులతో అదరగొట్టి ఆయనను మించిన డాన్సర్ అనిపించుకుంది.ఇది కన్నడ సినిమా అయినా కరకట దమనక లోని పాట కావడం విశేషం.
సోషల్ మీడియాలో ఈ పాట బాగానే ఫేమస్ అయ్యింది.హితలక కరీబ్యాడా( Hithalaka Karibyada ) అనే ఈ పాటలతో ప్రభుదేవా తో పాటు నవిష్క నాయుడు అనే ఒక అమ్మాయి నటించింది.
ఈ సినిమాలో ఆమె కూడా ఒక హీరోయిన్ గా ఉంది.

నివిష్క స్టెప్స్ చూసిన వారంతా కూడా ఫిదా అయిపోతున్నారు.నివిష్క 2018 లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అమ్మ ఐ లవ్ యు అనే ఒక చిత్రంలో మొదటి నటించింది.బెంగళూరులోనే పుట్టి పెరిగిన నివిష్క అక్కడే సైకాలజీలో తన చదువులను పూర్తి చేసింది.
ఇప్పుడు తను చేసిన డ్యాన్స్ ద్వారా కన్నడ లోనే కాదు తెలుగులో కూడా బాగా ఫేమస్ అయిపోయారు నివిష్క.ప్రభుదేవా మించి ఈ అమ్మడు డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక నివిష్క కు వరస అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పాట ద్వారా.







