కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టిందే... కేంద్ర మంత్రి కీలక వాఖ్యలు

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నింటిని భయపెడుతుంది.

ముఖ్యంగా అగ్ర రాజ్యాలుగా చెప్పుకునే అమెరికా రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మన్ దేశాలని కరోనా అతలాకుతలం చేస్తుంది.

ఇక ఇండియాలో కూడా మెల్లగా ఈ వైరస్ ప్రభావం పెరుగుతుంది.ఓ వైపు ఈ వైరస్ కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తూనే ఈ వైరస్ పుట్టుక వెనుక కారణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో పుట్టిన ఈ వైరస్ సహజసిద్ధంగా పుట్టుంది కాదని, ఇది చైనా ల్యాబ్ లో పుట్టిందని, కచ్చితంగా కరోనా మానవ సృష్టే అని అమెరికా లాంటి దేశాలు చెబుతున్నాయి.ఇప్పుడు ఇదే విషయాన్ని బలపరిచే విధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వాఖ్యలు కూడా ఉన్నాయి.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్య‌లు చేశారు.ఇది సాధారణ వైరస్‌ కాదు.

Advertisement

కృత్రిమమైనది.వ్యాక్సిన్‌ తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.

ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు.వస్తే ఎలాంటి సమస్య ఉండదు.

ఇక మరో సమస్య ఏమిటంటే.వైరస్‌ను గుర్తించే మెథడాలజీ.

వైరస్‌ను వెంటనే గుర్తించే పద్ధతిని కనుగొనాల్సిన అవసరం ఉన్నది.ఇది ఊహించనిది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఎందుకంటే ఈ వైరస్‌ ల్యాబ్‌లో తయారైనది.మనం కరోనాతోపాటు ఆర్థిక యుద్ధం కూడా చేయాలి.

Advertisement

మనది పేదదేశం.నెలా నెలా లాక్‌డౌన్‌ను పొడిగించలేం అని అన్నారు.

కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు.గడ్కారీ నేరుగా చైనాపై వాఖ్యలు చేయకపోయిన ఈ వైరస్ వారి సృష్టే అని ట్రంప్ వాఖ్యలని సమర్దించినట్లు ఉన్నాయి.

మరి ఈ వాఖ్యలపై చైనా ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు