చదరంగం ఆడబోతున్న హీరో నితిన్! వచ్చే నెల సెట్స్ పైకి

యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాని వీలైనంత వేగంగా సిద్ధం చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నితిన్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోయే సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది.

అదే సమయంలో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యింది.

Advertisement

భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది.ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందుగా చెక్ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు.అయితే బెటర్ గా ఉంటుందని చదరంగం అనే టైటిల్ ని దీనికి ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ఈ సినిమా కథ మొత్తం చదరంగం గేమ్ పాయింట్ అఫ్ వ్యూ లో నడుస్తుంది.క్యారెక్టర్ డిజైన్ కూడా అదే తరహాలో ఉంటుంది.

అందుకే సినిమాకి సింక్ అయ్యే విధంగా టైటిల్ ఉంటే బాగుంటుంది అని చదరంగం టైటిల్ కి దర్శకుడు చంద్రశేఖర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి షెడ్యూల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయితే ఈ రెండు సినిమాలలో దేనిని ముందుగా నితిన్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు