అమ్మాయిలతో తిరగడం అంటే ఒకే.. కాని పెళ్ళికి నో అంటున్న కుర్ర హీరో

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు తమ స్టైల్ మార్చి కాస్తా కొత్తదనం అలాగే, ఎంటర్టైన్మెంట్ ఉండే కథలపై ద్రుష్టి సారిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్ లో సక్సెస్ లు కొట్టి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలంటే చాలా గట్టిగా ప్రయత్నం చేయాలి.

 Nithin Bhishma First Look-TeluguStop.com

సినిమా ఎవరేజ్ అనే టాక్ వచ్చిన నిర్మాతలకి నష్టాలే వస్తున్నాయి.కొడితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే అని కసితో హీరోలు ప్రయత్నం చేస్తున్నారు.

హిట్ లేకపోతే ఫ్యూచర్ ఉండదు అని డిసైడ్ అయిపోయారు.దీంతో సినిమాకి సినిమాకి గ్యాప్ తీసుకుంటున్న సాలిడ్ హిట్ పడే కథలపైనే ద్రుష్టి పెడుతున్నారు.

ఇప్పుడు ఈ వరుసలో నితిన్ కూడా చేరిపోయాడు.

కెరియర్ ఆరంభంలో వరుస హ్యాట్రిక్స్ కొట్టి, తరువాత గాడి తప్పిన నితిన్ మరల తనకి సరిపోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలతో హిట్స్ కొట్టాడు మళ్ళీ చివరిగా వచ్చిన రెండు సినిమాలు అతనికి చేదు ఫలితాన్ని అందించాయి.దీంతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న నీతి చలో సినిమాతో సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ వెంకి కుడుముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.భీష్మ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని నితిన్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా రిలీజ్ చేసారు.

ఇక ఈ లుక్ లో ఆలోచన నిండా అమ్మాయిలతో భీష్మ క్యారెక్టర్ కి సంబంధం లేకుండా ఉంది.ఇప్పుడు దీనిపై ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి.పేరుకే భీష్ముడు కాని ఆమ్మాయిల కలల రాకుమారుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube