టాలీవుడ్ లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ సాయి పల్లవి.ఆ సినిమాతో తెలుగు నాట సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి కెరియర్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకే చెప్పేయకుండా మనసుకి నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుంది.
ఇక టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా కూడా కెరియర్ లో రెగ్యులర్ హీరోల మాదిరి కాకుండా తనదైన శైలిలో కొత్తదనం ఉన్న కథలు ఎంచుకుంటూ తనని తను బెస్ట్ యాక్టర్ గా ఆవిష్కరించుకుంటున్నాడు.అలాగే తన ఇమేజ్ ని నేషనల్ వైడ్ పెంచుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే రానా తెలుగులో మరో డిఫరెంట్ జోనర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.నీది నాది ఒకటే కథ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రానాకి జోడీగా ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో రానా మొదటి సారి డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.గతంలో దాసరి, ఆర్ ఎన్ నారాయణ మూర్తి తెరకెక్కించిన విప్లవ చిత్రాల జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది.ఇందులో రానా, సాయి పల్లవి నక్శలైట్స్ గా కనిపించబోతున్నారు అని సమాచారం.
వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి అరాచకం ఎదిరించే వ్యక్తిగా, నక్షలిజం నుంచి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయ వచ్చిన వ్యక్తిగా రానా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.మరి ఎప్పుడో మరుగున పడిన విప్లవ సినిమాల జోనర్ లో రాబోతున్న ఈ సినిమాతో రానా ఎ స్థాయిలో హిట్ కొడతాడు అనేది వేచి చూడాలి.







