నిర్భయకేసులో ట్విస్ట్, ముగ్గురికే అమలుకానున్న ఉరిశిక్ష

నిర్భయ కేసులో దోషులకు శిక్షలు అయితే ఖరారు అయ్యాయి కానీ వాటి అమలు విషయం లో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

అసలు వారికి ఖరారు తేదీ నాటికి శిక్షలు అమలు అవుతాయా లేదా అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో మొదలైంది.

వరుస పిటీషన్ లతో కాలహరణం చేస్తూ నిర్భయ దోషులు ప్రవర్తిస్తున్నారు.నలుగురిని ఒకేసారి ఉరితీయాలని ఢిల్లీ లోని పటియాలా కోర్టు గతనెల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.ట్రయల్ ఉరి కార్యక్రమం కూడా నిర్వహించి సిద్ధంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా నిర్భయ దోషుల్లో ముగ్గురికి మాత్రమే ఉరిశిక్ష అమలు కానుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.కారణం నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉండడమే.

Advertisement

  వినయ్ క్షమాభిక్ష పిటీషన్ పెండింగ్ లో ఉండడం తో వినయ్ మినహా మిగిలిన ముగ్గురికి ఉరిశిక్షలు అమలు చేయమని కేంద్రం కూడా చెబుతుంది.దీనితో రేపు అసలు నలుగురికి ఉరిశిక్ష విధిస్తారా,లేదా ముగ్గురికేనా, అసలు ఉరిశిక్ష ఉంటుందా లేదా అన్న పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.మరోపక్క ఉరిశిక్ష అమలు కాలం దగ్గర పడుతుండడం తో శిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

వినయ్ మెర్సీ పిటీషన్ పెండింగ్ లో ఉండగానే మరో దోషి పవన్ గుప్తా తాజగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.నేరానికి పాల్పడిన సమయంలో తాను మైనర్‌ని అంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేయడంపై అతడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

తాను మైనర్‌ని అంటూ గతంలో పవన్ గుప్తా ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ప్రస్తుతం సుప్రీం కోర్టు లో రివ్యూ పిటీషన్ దాఖలు చేశాడు.

  నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు నలుగురికి ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నిందితుడి తాజా పటిషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.2012 డిసెంబర్ లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన అందరిని కలచివేసింది.ఇలాంటి ఘటనకు పాల్పడిన ఆ దుర్మార్గులకు శిక్షలు ఖరారు చేసినప్పటికి ఎదో ఒక పిటీషన్ తో వారి ఉరిశిక్షల అమలుపై సస్పెన్స్ నెలకొల్పుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

మరి ఈ పిటీషన్ లపై ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అన్నది పెద్ద ఉత్కంఠ ను నెలకొల్పింది.

Advertisement

తాజా వార్తలు