నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలు విషయం లో జాప్యం,ఆప్ పార్టీ నే కారణం అంటున్న కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీ ఆప్ పార్టీ వ్యవహార తీరుపై మరోసారి మండిపడ్డారు.2012 లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన నిందితుల ఉరితీత విషయంలో జాప్యం జరగడానికి అసలు కారణం ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వమే అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఎప్పుడో జరిగిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు దోషులకు శిక్షలు పడకపోవడానికి అక్కడి ప్రభుత్వమే కారణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీ వాల్ పై ఆరోపణలు చేశారు.

నిర్భయ ఘటనలో న్యాయం జరగడంలో జాప్యానికి ఆప్ ప్రభుత్వానిదే బాధ్యత అని, మెర్సీ పిటిషన్ దాఖలుకు గత రెండున్నర ఏళ్లలో ఈ సర్కార్ ఈ దోషులకు ఎందుకు నోటీసు జారీ చేయలేదని ఆయన గురువారం జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రశ్నించారు.సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అయిన వారం రోజుల్లోగా ఆప్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఉంటే ఇప్పటికే ఆ నలుగురు దోషులను ఉరి తీసి ఉండేవారని, ఈ దేశానికి న్యాయం జరిగి ఉండేదని జవదేకర్ పేర్కొన్నారు.

జైలు నిబంధనల ప్రకారం ఒక కేసులో ఒకరికంటే ఎక్కువమందికి ఉరిశిక్ష విధించి ఉంటె వారిలో ఎవరైనా ఒకరు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేసుకున్న పక్షంలో ఇతర దోషుల ఉరితీత కూడా వాయిదా వేయాల్సి పడుతుంది.

ఈ క్రమంలోనే నిర్భయ దోషులకు ఈనెల 22 న ఉరిశిక్ష అమలు చేయాలి అంటూ ఢిల్లీ పటియాలా కోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.అయితే 2017 లోనే ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం రెండున్నరేళ్ల ల్లో నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు ఎందుకు నోటీసులు జారీచేయలేదని ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రశ్నించారు.అయితే ప్రస్తుతం నిందితుల్లో ఒకరు క్షమాభిక్ష పిటీషన్ దాఖలు చేయడం తో ఇతర నిందితుల ఉరిశిక్షను కూడా నిలిపివేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి జవదేకర్ పై ప్రశ్నలు సంధించారు.

Advertisement

ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే నిర్భయ నిందితుల ఉరిశిక్ష అమలులో జాప్యం కు కారణం అని ఆయన తేల్చి చెప్పారు.గత ఏడేళ్లు గా ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికి కూడా నిర్భయ దోషులకు ఎలాంటి శిక్ష అమలు చేయకపోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు