మ్యూజియంలోని ఏడు లక్షలను మూడు నిమిషాల్లో కొట్టేశారు.. ఎవరంటే?

మూడు నిమిషాల్లో ఎవరైనా దొంగతనం చెయ్యగలరా? అది కూడా మ్యూజియంలో దొంగతనం అసలు చెయ్యగలరా? లేదు కదా! కానీ జపాన్ లోని టోక్యోలో మాత్రం మూడు నిమిషాల్లో దొంగతనం చేశారు.

వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికి వారు కేవలం మూడు నిమిషాల్లో దొంగతనం చేసి అందరిని షాక్ కి గురి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.జపాన్‌లోని టోక్యోలో ఇగా-ర్యూ అనే మ్యూజియం ఉంది.

ఈ మ్యూజియంను నింజాస్‌ వంశ చరిత్రకు అంకితం ఇచ్చారు.ఇక ఆ మ్యూజియంను సందర్శించేందుకు వచ్చిన సందర్శకుల నుంచి వసూలు చేసిన ఎంట్రీ ఫీజ్ ను వారు దొంగలించారు.

ఎంట్రీ ఫీజ్ అంటే వెయ్యి రెండు వందలు కాదు.సుమారు వెయ్యి మంది ఇచ్చిన ఎంట్రీ ఫి అది.అంటే మన కరెన్సీలో అది ఏడు లక్షల రూపాయిలు.ఇక ఆ కరెన్సీ బరువు దాదాపు 150 కిలోలు ఉందట.

Advertisement

అలాంటిది వారు కేవలం మూడు నిమిషాలలో దొంగతనం పూర్తి చెయ్యడం ఆశ్చర్యకరంగా మారింది .దోపిడీ జరిగినరోజు రాత్రి ఒక కారు మ్యూజియం దగ్గర వచ్చింది.ఇక అందులో నుంచి ఓ వ్యక్తి వచ్చి కెమెరాను కిందికి వంచేశాడు.

అనంతరం ఆ దొంగలు పని కానిచ్చారు.ఇక్కడ విశేషం ఏంటి అంటే? మ్యూజియంలో అలారం కూడా దొంగతనం చేసిన తర్వాత మోగింది.ఆ అలారం విన్న పోలీసులు అక్కడికి వచ్చే సరికి అక్కడ డబ్బులతో పాటు దొంగలు కూడా కనిపించలేదు.

అయితే ఇంత వేగవంతమైన దొంగతనం కేవలం ప్రాచీన జపనీస్‌ చరిత్రలో నింజాస్‌ భూస్వామ్య వర్గానికి చెందిన యోధులు మాత్రమే చేసేవారట.ఇప్పుడు వీరు కూడా చెయ్యడంతో ఈ దొంగలు కూడా వారి వారసులేనేమో అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు