అమెరికా: స్పెల్లింగ్‌ - బీ పోటీలు.. 11 మంది ఫైనలిస్ట్‌ల్లో 9 మంది భారత సంతతి బాలలే

అమెరికాలో ప్రతిఏటా జరిగే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో గడిచిన భారత సంతతి బాలలు సత్తా చాటుతూ మన కీర్తిని రెపరెపలాడిస్తున్నారు.తాజాగా స్పెల్లింగ్‌ బీ 2021 పోటీల్లో 209 మంది చిన్నారులు పాల్గొనగా.

11 మంది ఫైనల్‌కు చేరుకున్నారు.వారిలో తొమ్మిది మంది భారత సంతతికి చెందిన విద్యార్ధులే కావడం విశేషం.

జూలై 8న జరగనున్న ఫైనల్‌లో వీరు టైటిల్ కోసం తలపడనున్నారు.ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో ఉన్న వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌లో స్పెల్లింగ్‌ బీ 2021 ఫైనల్‌ జరగనుంది.

వీటిని ఈఎస్పీఎన్‌-2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.స్పెల్లింగ్‌బీలో దశలవారీగా గెలవడం ఒక ఎత్తైతే.

Advertisement

ఫైనల్స్‌ టైటిల్‌ సాధించడం మరో ఎత్తు.న్యాయనిర్ణేతలు అడిగిన పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్‌ను క్షణాల్లో చెప్పాల్సి ఉంటుంది.

ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్ సంస్థ 50 వేల డాలర్లు నగదు బహుమతి, మెడల్‌, ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ఇవ్వనుంది.అలాగే మెరియమ్‌ -వెబ్‌స్టర్‌ డిక్షనరీ వారు 2,500 డాలర్లు.

కొన్ని పుస్తకాలు బహుకరిస్తారు.దీనితో పాటు బ్రిటానికా సంస్థ 400 డాలర్లు విలువ చేసే పుస్తకాలు, మూడేళ్లపాటు బ్రిటానికా ఆన్‌లైన్‌ ప్రిమియమ్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వనుంది.గడిచిన 20 ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో అమెరికన్లతో పోటీ పడుతూ భారత సంతతి బాలలు సత్తా చాటుతున్నారు.2020లో జరగాల్సిన స్పెల్లింగ్‌ బీ పోటీలు కరోనా ఉద్ధృతి కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.2019లో జరిగిన స్పెల్లింగ్ బీ పోటీల్లో 8 మంది కో ఛాంపియన్లుగా నిలవగా.వారిలో ఏడుగురు భారత సంతతి చిన్నారులే కావడం గమనార్హం.1999 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో ఇప్పటి వరకు 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఛాంపియన్లుగా అవతరించారు.

స్పెల్లింగ్‌ బీ -2021 ఫైనల్‌కు చేరిన చిన్నారులు వీరే.రాయ్‌ సెలిగ్మన్‌(12) - (ది బహమాస్‌), భావన మదిని (13) - (న్యూయార్క్‌), శ్రీతన్‌ గాజుల (14) - (నార్త్‌ కరోలినా), ఆశ్రిత గాంధారి (14) - (వర్జినియా), అవనీ జోషి (13) - (ఇల్లినాయిస్‌), జైలా అవంత్‌ గార్డే (14) - (న్యూ ఓర్లియన్స్‌), వివిన్షా వెదురు(10) - (టెక్సాస్‌), ధ్రువ్‌ భారతీయ (12) - (డల్లాస్‌), విహాన్‌ సిబల్‌ (12) - (టెక్సాస్‌), అక్షయినీ కమ్మ(13) - (టెక్సాస్‌), ఛైత్ర తుమ్మల (12) - (శాన్‌ఫ్రాన్సిస్కో) .

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు