దేశంలో స్త్రీలకూ రక్షణ లేదు,ఒంటరిగా ఏ స్త్రీ కూడా తిరగలేకపోతుంది అంటూ పలువురు వాపోతున్నారు.అయితే ఇప్పుడు సమాజం ఎలా మారిపోయింది అంటే ఒక్క స్త్రీ కె కాదు ఒక చిన్నారి కి కూడా ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది అనే విధంగా తాజాగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
వయసు తో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా కామాంధులు తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు.ఈ విదేశంగా ఒక ఉన్మాది అత్యాచారానికి తొమ్మిది నెలల చిన్నారి బలి అయ్యింది.
ఈ ఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగింది.మేడ పై తల్లిదండ్రులతో పడుతున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్ళి ప్రవీణ్ అనే యువకుడు ఆ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
దీనితో ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తుంది.
బిడ్డ కనిపించక పోవడం తో వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లిదండ్రులకు చిన్నారి దయనీయ పరిస్థితిలో కనిపించింది.
అప్పటికే ఊపిరి అందక ఆ చిన్నారి మృత్యువు తో పోరాడుతుండగా గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసారు.అయితే ఆ చిన్నారి మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
అయితే ఈ దారుణానికి పాల్పడిన ప్రవీణ్ ను స్థానికుల సాయం తో పట్టుకొని చితక్కొట్టి హన్మకొండ పోలీసులకు అప్పగించారు.దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







