నోరు అదుపులోలేక పోవడం తో వేటుకు గురైన కాంగ్రెస్ నేత

నోరు అదుపులో లేకపోతే ఎంత నష్టం కలుగుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు.అందులోనూ రాజకీయ నేతలు నోటిని తమ అదుపులో ఉంచుకోక పొతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.

సరిగ్గా కర్ణాటక లో ఒక కాంగ్రెస్ నేతకు నోటి దూల కారణంగా పార్టీ వేటుకు గురయ్యారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ పై ఆ పార్టీ వేటు వేసింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో రోషన్ బేగ్ పార్టీ రాష్ట్ర న్యాయకత్వం పై సంచలన విమర్శలు చేశారు.రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు అసమర్ధుడు అని,మాజీ సి ఎం సిద్ద రామయ్య అహంకారి అని అనడమే కాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ఒక జోకర్ అంటూ విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రోషన్ బేగ్ ను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన రోషన్‌ బేగ్‌.పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు.ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు.

గత కొన్ని రోజులుగా రోషన్‌ బేగ్‌ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక లో మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు