పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రేపు మంత్రి ఆదిమూలపు సురేష్ పంపిణీ చేయనున్న 1860 టిడ్కో గృహాలను ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూవైసీపి నాయకులు టిడ్కో ఇండ్ల నిర్మాణంలో అసత్యాలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.
టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కోఇండ్లకు వైసీపి ప్రభుత్వం మూడు సంత్సరలు లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తయిన ఇండ్లకు వైసిపి రంగులు వేసుకుని తాము నిర్మించినట్లు అసత్యాలు మాట్లాడుతున్నారున్నారు అసెంబ్లీ లో తాను అడిగిన ప్రశ్న కు సాక్షాత్తు అసెంబ్లీ అధికారులు 2019 నాటికి 3360 టిడ్కోఇండ్లు పూర్తయ్యాయని సమాధానం ఇచ్చారన్నారు.టిడిపి హయాంలో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులతో కలసి తాను చేసిన పోరాటాలకు మూడు సంవత్సరాలుకు అయినా ప్రభుత్వం దిగి వచ్చి లబ్ధిదారులకు1860 ఇండ్లు పంపిణీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
మిగతా ఇండ్లు కూడా పూర్తి చేసి లబ్ధి దారులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.







