కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు.
పార్టీ కోసం 30 సంవత్సరాలు ఎంతో కష్టపడి పని చేసినా గుర్తింపు లేదన్నారు.ప్రజా ప్రతినిధులు చేయకూడని పనులు చేసి, జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో పని చేయలేనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
పార్టీ ద్రోహులకు, వ్యక్తిగత విమర్శలు చేసిన వారికి కీలక పదవులు అప్పగించడం బాధ కలిగించాయని లేఖలో పేర్కొన్నారు.అందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.







