వివేక్ రామస్వామిని టార్గెట్ చేసిన నిక్కీ హేలీ.. ‘‘ ఓటు హక్కు వయసు’’ పెంపు ప్రతిపాదనపై ర్యాలీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు కత్తులు దూసుకుంటున్న సంగతి తెలిసిందే.తొలి రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్ నుంచే వీరిద్దరి మధ్య వైరం ఏర్పడింది.

 Nikki Haley Rallies Against 2024 Rival Vivek Ramaswamy Voting Age Proposal Detai-TeluguStop.com

రామస్వామి( Vivek Ramaswamy ) విదేశాంగ విధానాన్ని నిక్కీ తప్పుబట్టారు.దీనికి వివేక్ కూడా ఘాటుగానే బదులిచ్చారు.

తాజాగా దేశంలో ఓటు హక్కు వయసును 25 ఏళ్లకి పెంచాలన్న వివేక్ రామస్వామి ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిక్కీ హేలీ ( Nikki Haley ) ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిని తప్పుబడుతూ శనివారం ఆమె అయోవాలో ర్యాలీ నిర్వహించారు.

క్లైవ్‌లోని హారిజోన్ ఈవెంట్స్ సెంటర్‌లో( Horizon Events Center ) టౌన్‌హాల్‌లో నిక్కీ మాట్లాడుతూ.యుద్ధంలో పోరాడేంత వయసులో వుంటే, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.ఈ ఏడాది మేలో ఓటింగ్‌ వయస్సును 18 నుంచి 25 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు వివేక్.ఈ ప్రతిపాదనతో నిక్కీహేలీ ఏకీభవించలేదు.

రాజకీయాల్లో డ్రైవర్ సీటులో యువత వుండాలని తాము కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.దేశంలో 18 ఏళ్లు నిండినవారు ఓటు వేయాలని తాను కోరుకుంటున్నానని హేలీ అన్నారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిదీ మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందన్నారు.

Telugu Calinia, China, Horizon, Iowa, Nikki Haley, Republican, Tiktok, President

ఇకపోతే.బుధవారం కాలిఫోర్నియాలో( California ) జరిగిన సెకండ్ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లోనూ వివేక్ రామస్వామితో నిక్కీ హేలీ గొడవపడ్డారు.రామస్వామి టిక్‌టాక్‌ను( TikTok ) వినియోగించడాన్ని ఆమె విమర్శించారు.చైనీస్ మాతృసంస్థకు చెందిన టిక్‌టాక్ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిక్కీ పేర్కొన్నారు.150 మిలియన్ల మంది టిక్‌టాక్ వినియోగిస్తున్నారని.ఈ ఫ్లాట్‌ఫాం సాయంతో చాలామంది మీ పరిచయాలను, మీ ఆర్ధిక సమాచారాన్ని, మీ ఈమెయిల్‌ను పొందవచ్చని రామస్వామిని నిక్కీ హెచ్చరించారు.

Telugu Calinia, China, Horizon, Iowa, Nikki Haley, Republican, Tiktok, President

అలాగే అయోవాలో జరిగిన ర్యాలీలోనూ చైనాకు వ్యతిరేకంగా నిక్కీ తన స్వరాన్ని వినిపించారు.అమెరికా ప్రభుత్వం బీజింగ్‌కు వ్యతిరేకంగా మరింత పటిష్టమైన వైఖరిని అవలంభించాల్సిన అవసరం వుందన్నారు.అమెరికా సైనిక స్థావరాలు, ఆహార ఉత్పత్తిదారుల దగ్గర భూమిని కొనుగోలు చేయడం ద్వారా చైనా ( China ) ఇప్పటికే అమెరికాలోకి చొరబడిందని నిక్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే చైనాతో కొన్ని సాంకేతికతలను పంచుకోవడం కూడా నిలిపివేయాలని నిక్కీ హేలి పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube