యువ హీరో నిఖిల్ లీడ్ రోల్ లో చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా కార్తికేయ 2.ఆల్రెడీ 2014లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ కాగా ఈ మూవీకి సీక్వల్ గా కార్తికేయ 2 వస్తుంది.
ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.కార్తికేయ 2 సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
కార్తికేయ 2 సినిమా ద్వారక బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది.సినిమాని ఆగష్టు 12న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు నిఖిల్.సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే స్మాల్ స్క్రీన్ మీద రియాలిటీ షోస్, స్పెషల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తారు.కానీ నిఖిల్ కార్తికేయ 2 కోసం సీరియల్స్ లో కూడా ప్రయత్నిస్తున్నారు.
తెలుగింటి ఆడపడుచులకు సీరియల్స్ అంటే మహా ఇష్టం.అందుకే సీరియల్స్ ద్వారా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఇందుకోసం ప్రేక్షకాదరణ పొందుతున్న కొన్ని సీరియల్స్ లో నిఖిల్ కనిపిస్తారని తెలుస్తుంది.

ఇప్పుడు సినిమా తీయడం కన్నా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది.అందుకే ఈమధ్య స్టార్ హీరోనా.యువ హీరోనా అన్న తేడా లేకుండా అందరు తమ సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఇంత ప్రమోషన్స్ చేసినా సరే ఈమధ్య ఆడియెన్స్ థియేటర్ కి రావడం కష్టం అవుతుంది.టికెట్ల రేట్లతో పాటుగా నిత్యావసరాల ఖర్చులు పెరగడం కూడా వారికి సినిమాల మీఎద ఉన్న ఆసక్తిని తగ్గించాయి.
నాలుగు వారాలు ఆగితే ఓటీటీలో వస్తుంది అప్పుడు ఫ్యామిలీ మొత్తం చూద్దాం లే అన్న ఆలోచన ఉంది.అందుకే థియేటర్ లో సినిమాని ఎంజాయ్ చేసేలా బాగా ప్రమోషన్స్ చేస్తున్నారు.







