హీరోలు అన్న తర్వాత తమ దగ్గరికి వచ్చిన కొన్ని కథలను రిజెక్ట్ చేయడం చేస్తూ ఉంటారు.కానీ హీరో రిజెక్ట్ చేసిన కథ ఆ తర్వాత సూపర్ హిట్ సాధించింది అంటే ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదేమో బాధపడిపోతుంటారు హీరోలు.
అదే రిజెక్ట్ చేసిన సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే.ఆ కథను రిజెక్ట్ చేసిన హీరోల బాధ వర్ణనాతీతం గానే ఉంటుంది అని చెప్పాలి.
రవితేజ కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది.సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది పోకిరి సినిమా.
అంతేకాదు మహేష్ బాబుకు ఒక్కసారిగా మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది అని చెప్పాలి.నిర్మాతలకు అయితే లాభాల పంట పండించింది.
అయితే పూరి జగన్నాథ్ కు పోకిరి కథ వినిపించడానికి ముందు దర్శకుడు పూరి ఈ కథను మరికొంత మరో హీరోకి చెప్పాడట.ఆ హీరో ఎవరో కాదు రవితేజ.
ఈ సినిమాలో కామెడీ యాక్షన్ రొమాన్స్ కి రవితేజ సరిగ్గా సరిపోతాడని భావించిన పూరి జగన్నాథ్ ఈ కథని ముందుగా అతనికి వినిపించాడట.
రవితేజ కు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చింది.కానీ అప్పటికే రవితేజ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.దీంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది అని భావించిన పూరి జగన్నాథ్ మహేష్ బాబుకు కథ వినిపించగా మహేష్ బాబుకు కూడా ఈ సినిమా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు.
ఈ క్రమంలోనే కొన్ని మార్పులు చేర్పులు చెప్పగా పూరిజగన్నాథ్ దాన్ని పూర్తి చేశాడు.చివరికి పోకిరి అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది అని చెప్పాలి.అదే సమయంలో రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కానీ కమర్షియల్‌గా విజయం మాత్రం అందుకోలేకపోయింది అనే విషయం తెలిసిందే.