హ్యాపీడేస్ చిత్రంతో నిఖిల్ సిద్దార్థ్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరస విజయాలు సాధించి ప్రేక్షకులను అలరించాడు.కానీ ఈ మధ్య ప్లాపులు రావడంతో కాస్త వెనుకబడ్డాడు.
ఈయన నటించిన కార్తికేయ సినిమాతో టాలీవుడ్ లో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు.
చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా తిరుమలలో పూజ కార్యక్రమాలు జరుపుకుంది.
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధం అయ్యింది.ఈ సినిమాలో కూడా చందు మొండేటి మరొక కొత్త స్టోరీ లైన్ తో మన ముందుకు రాబోతున్నాడు.
కార్తికేయ సినిమా సీక్వెల్ గా రాబోతున్న కార్తికేయ 2 సినిమాను మరింత భారీ బడ్జెట్ తో తీసుకురాబోతున్నారు.

ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే నిఖిల్ ఈ సినిమా తర్వాత మరొక కొత్త కంటెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది.కోన వెంకట్ రాసిన ఒక సరికొత్త కథలో నటించడానికి నిఖిల్ ఒప్పుకున్నట్లు సమాచారం.
ఈ కథను కోన వెంకట్ మెడికల్ థ్రిల్లర్ గా రాసుకున్నాడని తెలుస్తుంది.ఇది పూర్తిగా కొత్త కంటెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా కథను కోన వెంకట్ మొదటగా సాయి ధరమ్ తేజ్ కు చెప్పి ఒప్పించినట్లు సమాచారం.అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.
అందుకే ఈ సినిమా నుండి సాయి ధరమ్ తేజ్ తప్పుకున్నట్లు తెలుస్తుంది.తర్వాత ఈ కథ నిఖిల్ కు చెప్పి ఒప్పించాడట.
చూడాలి మరి ఈ కథతో ఏ మేరకు నిఖిల్ హిట్ అందుకుంటాడో.