ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య ఘటన భారత్ , కెనడాల( India , Canada ) మధ్య చిచ్చు రాజేసిన సంగతి తెలిసిందే.దీని వెనుక భారత ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి.అలాగే రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి.
ట్రూడో వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజం సైతం తప్పుబట్టింది.సొంత దేశంలోనూ ఆయనకు మిశ్రమంగా మద్ధతు అందుతోంది.

ఈ క్రమంలో కెనడాలోని ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ పోయిలీవ్రే( Pierre Poilivre ) స్పందించారు.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్లకు సంబంధం వుంది అనడానికి ఆధారాలు చూపాలని ఆయన ట్రూడోను కోరారు.తొలుత ప్రధానికి మద్ధతుగా నిలిచిన పియర్.మరుసటి రోజు మాత్రం ట్రూడో వాదనలకు ఆధారాలు చూపాల్సిందిగా కోరారు.ప్రధాని అన్ని వాస్తవాలను స్పష్టంగా తెలుసుకోవాలని.కెనడియన్లు దానిపై తీర్పు ఇవ్వడానికి కావాల్సిన అన్ని సాక్ష్యాలను అన్వేషించాలని పియర్.
మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఆరోపణలు అవాస్తవమైతే పరిణామాలు ఏంటి అన్న మీడియా ప్రశ్నకు ‘‘నిజమే’’ నంటూ బదులిచ్చారు.కెనడియన్లకు బహిరంగంగా చెప్పిన దానికంటే తనకు వ్యక్తిగతంగా ఏం చెప్పలేదని పియర్ అన్నారు.ట్రూడో( Trudeau ) నుంచి మరింత సమాచారం కావాలని కోరుకుంటున్నానని ప్రతిపక్షనేత చెప్పారు.
మరోవైపు కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై ఏళ్ల తరబడి ట్రూడో ప్రభుత్వం చర్య తీసుకోకపోవడాన్ని నిజ్జర్ హత్యతో పోల్చారు పియర్.ఇద్దరు కెనడియన్ పౌరులను బీజింగ్‌లో బందీలుగా వుంచారని, దీనిపై ప్రధాని ఏం చెప్పలేదని పియర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.నిజ్జర్ హత్య, ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో కెనడాలో సిక్కు గ్రూపులు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.