వివాహం జరిగి ఇద్దరూ పిల్లలు ఉన్న వ్యక్తి ప్రేమించాలంటూ మరో యువతిని వెంటపడుతూ వేధించాడు.ఆ యువతి ప్రేమను నిరాకరించడంతో ఏకంగా ఆ యువతిని హత్య చేసిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో( Komaram Bheem Asifabad ) చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
సిర్పూర్ (టీ)మండలం వెంకట్రావు పేట్ గ్రామంలో నివసిస్తున్న దందే కమలాకర్ (28) అనే వ్యక్తికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే కమలాకర్( Kamalakar ) అదే గ్రామానికి చెందిన దీప(19) అనే యువతీని ప్రేమ పేరుతో వేధించేవాడు.
దీప అతని ప్రేమను ( Love )నిరాకరించింది.అయినా కూడా వెంటపడుతూ తనతోనే మాట్లాడాలని ఇతరులతో మాట్లాడకూడదని, కేవలం తనతో మాత్రమే చనువుగా ఉండాలని లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు.

అంతే కాకుండా వాట్సప్ లలో( Whatsapp ) అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ వేధించేవాడు.ఈ విషయం బయట తెలిస్తే గ్రామంలో పరువు పోతుందని దీప( Deepa ) ఎవరికి చెప్పలేదు.అయితే సెప్టెంబర్ 17న సాయంత్రం కమలాకర్ దీప ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించాడు.ఇంట్లో ఉన్న పురుగుల మందును దీపకు బలవంతంగా తాగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీప బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దీపను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అయినా కూడా పరిస్థితి ఇంకా విషమం కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దీప సోమవారం మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కమలాకర్ నిజస్వరూపం బయటపడినట్లు కౌటాల సిఐ సాదిక్ పాషా పేర్కొన్నారు.
నిందితుని పై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.







