ఏపీ ప్రజలను గత కొన్నాళ్లుగా తీవ్ర కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అదే రాజధాని మార్పు అంశం.ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని( Amaravat0 ) కాదని మూడు రాజధానుల అమలుకై జగన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్.ఇలా మూడు ప్రాంతాల ప్రజలను కవర్ చేస్తూ త్రీ క్యాపిటల్స్ అంశాన్ని జగన్ సర్కార్ తెరపైకి తెచ్చిన సంగతి విధాతమే.
అయితే ఈ మూడు రాజధానుల అంశానికి అడుగడుగున అడ్డంకులే ఏర్పడుతున్నాయి.

అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తిరుగుబాటు చేయడం, దాంతో రైతుల సమస్య తీరే వరకు త్రీ క్యాపిటల్స్ ప్రతిపాదనను హోల్డ్ లో ఉంచాలని కోర్టు నుంచి ఆదేశాలు రావడం వంటి కారణాలతో మూడు రాజధానుల అంశంపై తుదినిర్ణయానికి రాలేకపోయింది జగన్ సర్కార్.అయితే త్రీ క్యాపిటల్స్ జరగకపోయిన రాజధాని మార్పు మాత్రం గ్యారెంటీ అని ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూనే ఉంది.అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకు తరలిస్తున్నామని, అక్కడి నుంచే పాలన సాగుతుందని స్వయంగా ఏపీ సిఎం జగనే గతంలో స్పష్టం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయ పనులు కూడా అక్కడ చకచక జరుగుతున్నాయని టాక్.

అయితే విశాఖలో జగన్ సర్కార్( YS Jagan Mohan Reddy ) భారీగా వనరుల దోపిడికి పాల్పడుతోందని ఆరోపణలు వస్తూండడం రిషికొండ వంటి ప్రకృతి ప్రదేశాల వైపుకు ఇతరులకు అనుమైట్ లేకపోవడం వంటి కారణాలతో విశాఖను రాజధానిగా చేయడానికి ఆ ప్రాంత ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.దీంతో అసలు విశాఖ కేంద్రంగా రాజధాని ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతూ వచ్చాయి.అయితే రాజధాని మార్పుకు సంబంధించి తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది దసరా రోజు నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగిస్తున్నట్లు జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట.దీంతో మరోసారి రాజధాని మార్పు చర్చనీయాంశం అవుతోంది.
మరి ఈసారైనా రాజధాని మార్పులో జగన్ ముందడుగు వేస్తారేమో చూడాలి.







