ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆదర్శ పార్లమెంటేరియన్ విభాగంలో శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి నిజామాబాద్ ఎంపీ కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ చేతుల మీదుగా అవార్డును ఎంపీ కవిత అందుకున్నారు.
మొత్తం 545 మంది ఎంపీలకు గాను సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేశారు.

ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లు వచ్చాయి.కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొంది.







