నిహారిక పసుపు ఫంక్షన్ వీడియో నెట్టింట వైరల్..!

మెగా డాటర్.ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నటి నిహారిక కొణిదెల వివాహా పనులు ప్రారంభమయ్యాయి.

ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న నిహారిక పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి.దీంతో శ్రావణ సోమవారం నాడు పసుపు దంచే కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ముఖ్య ఘట్టానికి మెగా కుటుంబంలోని మహిళలందరూ హాజరయ్యి వేడుకను చేశారు.ఈ వేడుకలో నిహారిక కూడా పసుపు కొమ్ములు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చెయ్యగా ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.నెటిజన్లను ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటుంది.

Advertisement

కాగా గత గురువారం నిహారిక నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్లో జరిగిన సంగతి తెలిసింది.

గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారికతో ఎంగేజ్‌మెంట్ జరిగింది.ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫామ్యిలి మొత్తం హాజరయ్యి సందడి సందడి చేశారు.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు