యంగ్ హీరో సినిమా కోసం మెగా డాటర్ నిహారికతో సంప్రదింపులు!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవలే వెబ్‌ సిరీస్ డెడ్ పిక్సల్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిహారిక( Niharika Konidela ) సోషల్‌ మీడియా లో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

 Niharika Konidela In Young Hero Movie,niharika Konidela,young Hero,niharika Movi-TeluguStop.com

ఆమె యొక్క అందాల ఆరబోత రెగ్యులర్‌ కమర్షియల్స్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది అనడంలో సందేహం లేదు.అందుకే ఆమె మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడుతుంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్‌ లో ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్న ఒక యంగ్‌ హీరోకు జోడీగా నిహారిక ను నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారట.

అందుకే నిహారిక సోషల్ మీడియా( Niharika Instagram ) లో ఈ తరహా లో ఫోటోలు షేర్‌ చేస్తుంది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.గతంలో యంగ్‌ హీరోలకు జోడీగా నిహారిక హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.అందుకే ఇప్పుడు మరోసారి నిహారిక పద్దతైన పాత్రల్లో నటిచేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే నిహారిక యొక్క కొత్త సినిమా( Niharika Re Entry ) ఈ ఏడాది లో ప్రారంభం అయ్యి వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.భారీ అంచనాల నడుమ నిహారిక సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

గతంలో నిహారిక హీరోయిన్ గా చేసిన సమయంలో దురదృష్టం కొద్ది ఆ సినిమా లు కమర్షియల్ గా నిరాశ పర్చాయి.ఇప్పుడు మళ్లీ నిహారిక సినీ ఇండస్ట్రీ లో అడుగు పెట్టబోతుంది.కనుక కచ్చితంగా సక్సెస్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.నిహారిక మంచి కథ లతో సినిమా లను ఎంపిక చేసుకుంటే తప్పకుండా కమర్షియల్‌ హిట్‌ దక్కుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube