ఆ వ్యక్తితో టర్కీకి వెళ్లిన నిహారిక కొణిదెల.. వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ?

టాలీవుడ్ నటి, మెగా బ్యూటీ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే.మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ మెగా ప్రిన్సెస్ కొంతవరకు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.

 Niharika Konidela Enjoys With Her Friend In Turkey Details, Niharika Konidela, T-TeluguStop.com

కానీ ఎందుకో ఈమెకు వెండితెరపై అంతగా కలిసి రాలేదు.కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది.

ఆ తర్వాత అంతగా అవకాశాలు కూడా అందుకోలేకపోయింది.ఇక వెండితెరకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా బాగా టచ్ లో ఉంటుంది.గతంలో నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.ఓ వెబ్ సిరీస్ ను కూడా విడుదల చేసి మంచి సక్సెస్ అందుకుంది.

ఇక గతంలో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలిగా అడుగు పెట్టింది.

ఇక పెళ్లి తర్వాత మాత్రం మరింత యాక్టివ్ గా మారింది.

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ తో హల్ చల్ చేస్తుంది.పైగా ఫ్యాషన్ గా రెడీ అవుతూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.

హాట్ హాట్ లుక్ లతో అందర్నీ ఫిదా చేస్తుంది.ఇక తన భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

బాగా ట్రిప్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.పైగా నాగబాబుకు గారాల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ కూడా దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది.గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది.

అంతలోనే ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కిన సంగతి తెలిసిందే.అలా కొన్ని రోజులు తన ఇన్ స్టాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి ఇటీవలే ఇన్ స్టా లో అడుగు పెట్టింది.

ఇక అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పొట్టి పొట్టి బట్టలతో మళ్ళీ దర్శనమిస్తుంది.అయినా కూడా నెగిటివ్ కామెంట్లు బాగా ఎదుర్కొంటుంది.ఇక అవన్నీ పట్టించుకోకుండా నిహారిక తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.

జాగ్రత్తగా అడుగులు వేస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తను తన ఫ్రెండ్ తో టర్కీ ట్రిప్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక దానికి సంబంధించిన వీడియోస్, పిక్స్ బాగా షేర్ చేసుకుంటుంది.

అలా తాజాగా ఓ వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియో లో తాము బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

అంతేకాకుండా అందులో తాను వైన్ తాగినట్లు కనిపిస్తుంది.దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్ బాగా కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాకుండా ఇవ్వని అవసరమా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube