శ్రీ సత్యసాయి జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి.గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జైమంగళి నది, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
హిందూపురంలోనీ లోతట్టు ప్రాంతాలు అన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.చౌడేశ్వరి కాలనీ, వన్నమ్మ కాలనీల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అదేవిధంగా హిందూపురం నుంచి లేపాక్షి, పెనుకొండ, కదిరికి సైతం రాకపోకలు నిలిచిపోయాయ.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.