తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎదిరించి మరి హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది నిహారిక.నిహారిక ఎంతో యాక్టివ్ గా ఉండడంతో పాటు చలాకీగా ఉంటూ తన చుట్టూ ఉండే వారిని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
పెళ్లి తర్వాత కూడా అదే విధంగా యాక్టివ్ గా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది నిహారిక.
ఇది ఇలా ఉంటే తాజాగా నిహారిక ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న చెఫ్ మంత్ర సీజన్ 2 షోలో పాల్గొంది.
కాగా మంచు లక్ష్మి హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో కి నిహారికతో పాటు ఎం ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే హోస్ట్ మంచు లక్ష్మి వారి జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి రాబట్టింది.
అందులో భాగంగానే నిహారిక గతంలో నటించిన ఒక షార్ట్ ఫిలిం కి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది.ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు.దాన్ని కళాఖండం అంటారు లేండి అని నిహారిక కామెంట్స్ చేసింది.
అయితే అందరూ తనని నిహా అని పిలిస్తే కాలభైరవ మతం తనని ఆశ అని పిలుస్తారని తెలిపింది నిహారిక.

అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది.ఒక షార్ట్ ఫిలిం లో నిహారిక చేసిన పాత్ర ఆశ అని అందుకే నిహారికను ఆ పేరు పెట్టి పిలుస్తాను అని కాలభైరవ తెలిపాడు.అయితే ఆ షార్ట్ ఫిల్మ్ మాకు మాత్రమే తెలుసని, ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు కాలభైరవ.ఆ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అఖిల్ నటించగా, హీరోయిన్ గా నిహారిక నటించిందని ఈ లఘు చిత్రానికి రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వం వహించారని,కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఎందుకు రిలీజ్ కాలేదో అఖిల్, కార్తికేయలని అడగండి అని నిహారిక అన్నారు.
అంతేకాదు అదొక కళాఖండం అని కూడా పేర్కొన్నారు.







