టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ ప్రభాస్ శ్రీను గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇతడికి ప్రభాస్ అని పేరు రావడానికి కారణం ఏంటంటే.ఇతడు రెబల్ స్టార్ ప్రభాస్ తో స్నేహంగా ఉండేవాడు.
దాంతో ఆ గుర్తింపుగా తన పేరుకు ముందు ప్రభాస్ ను పెట్టుకున్నాడు.
ఇక ప్రభాస్ శ్రీను ఇంతకుముందు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్న సమయంలో బ్యాచ్ మేట్స్ గా ఉండేవారట.
ఇక ప్రభాస్ హీరోగా మారిన తర్వాత.ప్రభాస్ పనులన్నీ శ్రీను చూసుకునేవాడట.
అలా ప్రతి విషయంలో ప్రభాస్ కు శ్రీను తోడుగా ఉండే వాడట.ఇక శ్రీను కు కూడా సినిమాలలో అవకాశాలు రావడంతో సినిమాలలో అడుగుపెట్టాడు.
తొలిసారిగా ఈయన 2003 లో విడుదలైన సీతయ్య సినిమాతో పరిచయమయ్యాడు.
ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం, చక్రం సినిమాలలో కూడా నటించాడు.
దీంతో అతనిని నటనకు మంచి గుర్తింపు రావడంతో వరుసగా తెగ అవకాశాలు అందుకొని దూసుకెళ్లాడు.చాలావరకు ప్రభాస్ సినిమాల్లోనే నటించాడు.
ఇక స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించాడు.ఏడాదికి వరుస సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు ప్రభాస్ శీను.
ఇక ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమాలో కూడా నటించాడు.చాలా వరకు ఈయన నటించిన సినిమాలలో ఈయన పాత్రలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.ఇక ఇప్పటికీ ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.ఇక ఈయనకు పెళ్లయి పాప కూడా ఉంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తన గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.ముఖ్యంగా తన భార్య గురించి ఒక విషయాన్ని బయట పెట్టాడు.
అంతేకాకుండా తన జీవితంలో తను ఎన్నో తప్పులు చేశానని ఒప్పుకున్నాడు.ఇంతకు ఆయన చేసిన తప్పులు ఏంటో తెలుసుకుందాం.
ప్రభాస్ శ్రీను గతంలో పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన భార్య గురించి గొప్పగా చెప్పేవాడు.అయితే ఈ ఇంటర్వ్యూలో కూడా తన భార్య గురించి గొప్పగా చెప్పాడు.
తను నిజాయితీగా ఉంటుందని.తనకు ఓవరాక్షన్ చేయటం నచ్చదని తెలిపాడు.
తనేంటో తనకు తెలుసని అన్నాడు.ఇక ఎప్పుడైతే తన భార్య తన మీద అలిగి తన తల్లి గారి ఇంటికి వెళ్తే తట్టుకోలేను అని అన్నాడు.
ఇక చాలా వరకు తన భార్యది తప్పులు ఉండవని.అన్ని తప్పులు తానే చేస్తానని.ఇప్పటికీ ఎన్నో తప్పులు చేశానని తెలిపాడు.ఇక తన భార్య తనపై అలిగి తన తల్లి గారి ఇంటికి వెళ్తే తను ఇగో చంపుకొని తన భార్య దగ్గరికి వెళ్లి తీసుకొని వస్తానని తెలిపాడు.
తన పాప లేకుంటే కూడా తను ఉండడం కష్టమని అన్నాడు.ఇక ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.