నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు టాక్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరో వైపు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
అఖండ సినిమా విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసి చివరి దశకు తీసుకు వచ్చాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న అనిల్ ఈసారి బాలయ్యను సరికొత్తగా చూపించ డానికి రెడీ అవుతున్నాడు.అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి బాలయ్య కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక వైపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.
బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా పూర్తి చేస్తే వెంటనే ఈ సినిమాను అనిల్ పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు.
అందుకే నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం బాలీవుడ్ నటుడిని అనిల్ సంప్రదిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.

ఆ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించ బోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అనిల్ చర్చలు కూడా స్టార్ట్ చేసినట్టు రూమర్స్ వస్తున్నాయి..
ఇక ఈయన ఈ సినిమాలో భాగం అయితే వల్ల హిందీ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉంది.మరి అనిల్ వరుస హిట్స్ అందుకుంటున్న క్రమంలో బాలయ్యకు కూడా హిట్ ఇస్తాడో లేదో చూడాలి.







