నైజీరియాలోని ప్రజలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records )లో చోటు సంపాదించుకునేందుకు కొన్ని షాకింగ్ పనులను చేయడం చాలా కామన్.అయితే ఒక్కోసారి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసే క్రమంలో వీరు ప్రమాదాలకు గురవుతుంటారు.
మరికొన్ని సందర్భాల్లో శాశ్వతంగా అవయవాలు కోల్పోతుంటారు.ఇతర కేసుల్లో తాత్కాలికంగా ఇబ్బందులు పడుతూ నరక యాతన అనుభవిస్తుంటారు.
తాజాగా ఇలాంటి మరొక ఘోరం ఆ దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.టెంబు ఎబెరే అనే వ్యక్తి నాన్‌స్టాప్‌గా ఏడ్చే ఓ రికార్డును బద్దలు కొట్టాలనుకున్నాడు.అతను ఒక వారం మొత్తం ఏడ్చాడు, కానీ అది తీవ్ర అనారోగ్యానికి దారితీసింది.
కళ్లు కూడా వాచి పోయాయి.తలనొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
కొద్దిరోజుల పాటు అతడు అంధుడి( Blind )గా కూడా మారాడు.ఆ సమయంలో కళ్ళు కనిపించక చాలా ఇబ్బందిపడ్డాడు.
చివరికి అతడి చూపు మళ్ళీ వచ్చింది.అధికారికంగా రికార్డుల కోసం దరఖాస్తు చేసుకోనప్పటికీ.
తన కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో ఈ వ్యక్తి ఉన్నాడు.
మరో వ్యక్తి, హిల్డా బాసి( Hilda Baci ) నైజీరియన్ ఆహారాన్ని ప్రపంచానికి చూపించడానికి 100 గంటలు నాన్-స్టాప్( 100 Hour Non Stop Cooking ) గా వండటానికి ప్రయత్నించింది.ఆమెకు ప్రముఖుల నుంచి చాలా మద్దతు లభించింది, కానీ ఆమె కొన్ని గంటలలో లక్ష్యాన్ని కోల్పోయింది.అయినప్పటికీ, ఆమె భారతదేశ మునుపటి రికార్డును అధిగమించింది.
జాన్ ఒబోట్ అనే ఉపాధ్యాయుడు నైజీరియాలో ఎక్కువ మంది పఠనాన్ని ఇష్టపడేలా ప్రోత్సహించడానికి క్లాసిక్ పుస్తకాలను 140 గంటల పాటు బిగ్గరగా చదవాలని ప్లాన్ చేశాడు.
ఈ స్టెంట్స్ అన్నీ కూడా చాలా రిస్క్ తో కూడినవి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యాజమాన్యం ఇలాంటి స్టెంట్స్ చేయడానికి ప్రయత్నించవద్దని ప్రజలను కోరుతోంది.మరి నైజీరియన్లు ఇలాంటి డేంజరస్ స్టెంట్స్ చేయడం మానేస్తారో లేదో చూడాలి.